Homeక్రైమ్నూకరాజు కుటుంబ ఆత్మహత్య ఘటనలో సంచలన ఆరోపణలు.. లేఖలో కీలక విషయాలు!

నూకరాజు కుటుంబ ఆత్మహత్య ఘటనలో సంచలన ఆరోపణలు.. లేఖలో కీలక విషయాలు!

నూకరాజు కుటుంబ ఆత్మహత్య ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న వేళ కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి మరణించిన నూకరాజు అల్లుడు జగదీశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులు పోలీసులకు పలు ఆరోపణలతో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

జగదీశ్వర్ రెడ్డి తండ్రి భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. జగదీశ్వర్ భార్య సౌజన్య ఓ లేఖలో తన భర్తను సాధిక్ అనే వ్యక్తి హత్య చేశాడని పేర్కొన్నట్లు చెప్పారు. అలాగే, సౌజన్యను ఇస్లాం మతానికి సంబంధించిన పుస్తకాలు చదవాలని, మతం మారాలని జగదీశ్వర్ ఒత్తిడి చేశాడని భాస్కర్ ఆరోపించారు.

మరోవైపు సౌజన్యకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను అడ్డుపెట్టుకుని సాధిక్ ఆమెను వేధించినట్లు కూడా భాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

ఈ ఆరోపణల నేపథ్యంలో ఘటనకు దారితీసిన పరిస్థితులు, కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న వివాదాలు, లేఖలో పేర్కొన్న అంశాలపై పోలీసులు దృష్టి సారించినట్లు సమాచారం. ఆరోపణల్లో నిజానిజాలు తేల్చేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

also read: డాక్టర్ ప్రియాంక మృతి కేసులో కీలక పరిణామం.. నిందితుల పోలీస్ కస్టడీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు