Homeసినిమాసుధా కొంగరకు భారీ ఊరట... బకాయి చెల్లించాల్సిందేనని నిర్మాణ సంస్థను ఆదేశించిన మద్రాస్ హైకోర్టు

సుధా కొంగరకు భారీ ఊరట… బకాయి చెల్లించాల్సిందేనని నిర్మాణ సంస్థను ఆదేశించిన మద్రాస్ హైకోర్టు

ప్రముఖ దర్శకురాలు సుధా కొంగరకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. తనకు రావాల్సిన పారితోషికం చెల్లించలేదంటూ నిర్మాణ సంస్థపై ఆమె దాఖలు చేసిన కేసులో కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుధా కొంగరకు బకాయిపడిన రూ.8.39 కోట్లను నాలుగు వారాల్లోగా చెల్లించాలని నిర్మాణ సంస్థను ఆదేశించింది.

సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తికేయన్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘పరాశక్తి’ చిత్రం సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ, తనకు ఒప్పందం ప్రకారం రావాల్సిన పారితోషికం చెల్లించలేదని పేర్కొంటూ సుధా కొంగర న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఈ వివాదాన్ని ముందుగా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని మద్రాస్ హైకోర్టు సూచించింది. ఇందుకోసం మధ్యవర్తులను కూడా నియమించింది. అయితే కొన్ని కారణాల వల్ల నియమితులైన మధ్యవర్తులు ఈ వ్యవహారం నుంచి తప్పుకోవడంతో సమస్య పరిష్కారం కాలేదు.

దీంతో కేసు తిరిగి హైకోర్టు ముందుకు వచ్చింది. ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన అనంతరం సుధా కొంగరకు చెల్లించాల్సిన మొత్తంపై కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. రూ.8.39 కోట్ల బకాయిని నాలుగు వారాల్లోగా చెల్లించాలని ‘డాన్ పిక్చర్స్’కు సూచించింది.

అంతేకాకుండా నిర్ణీత గడువులోపు ఆ మొత్తాన్ని చెల్లించకపోతే, నిర్మాణ సంస్థ భవిష్యత్తులో రూపొందించే సినిమాల ద్వారా వచ్చే లాభాల నుంచి ముందుగా సుధా కొంగరకు చెల్లించాల్సిన బకాయిని తీర్చాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది.

ఈ తీర్పుతో తనకు రావాల్సిన పారితోషికంపై కొనసాగుతున్న వివాదానికి పరిష్కారం లభించడంతో సుధా కొంగరకు ఊరట లభించినట్లైంది. సినిమా విజయాపజయాలతో సంబంధం లేకుండా ఒప్పందంలో పేర్కొన్న పారితోషికాన్ని చెల్లించాల్సిన బాధ్యతపై ఈ కేసు మరోసారి చర్చకు దారితీసింది.

also read: కేంద్ర క్యాబినెట్ విస్తరణ…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు