Homeక్రైమ్అరెస్ట్‌పై మండిపడ్డ ఎంకే స్టాలిన్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

అరెస్ట్‌పై మండిపడ్డ ఎంకే స్టాలిన్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

క్రైమ్ మిర్రర్ :  నటి త్రిషపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో డీఎంకే నేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంపై మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. ఉదయనిధి స్టాలిన్‌పై తీసుకున్న చర్య చట్టపరమైన ప్రక్రియ కాదని, రాజకీయ ఉద్దేశాలతోనే ఈ చర్యకు పాల్పడ్డారని ఎంకే స్టాలిన్ ఆరోపించారు. కావేరి జలాల సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.

అధికారంలో ఉన్న వారి అహంకారం చివరకు పతనానికి దారి తీస్తుందని వ్యాఖ్యానించిన ఆయన, ప్రభుత్వ వ్యవహారశైలి ప్రజలకు అర్థమవుతోందన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రతిపక్ష నాయకుడిని దూరంగా ఉంచే ఉద్దేశంతోనే అరెస్టు చేశారనే ఆరోపణలు చేశారు. త్రిషపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నమోదైన కేసులో పోలీసులు ఉదయనిధి స్టాలిన్‌ను చెన్నైలోని ఆయన నివాసం నుంచి అదుపులోకి తీసుకుని విచారణకు తరలించారు. ఈ ఘటనపై డీఎంకే నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు, ప్రతిపక్షాలు, విద్యార్థులు, రైతులు, నిరసనకారులపై ప్రభుత్వం వరుసగా చర్యలు తీసుకుంటోందని డీఎంకే వర్గాలు ఆరోపించాయి. ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయ వర్గాల్లో వేడిని పెంచింది.
also read : సీఆర్పీఎఫ్ క్యాంపులో కాల్పుల కలకలం.. ఇద్దరు జవాన్లు మృతి

తాజావార్తలు