హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీ (NPA)లో ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి గురించి దర్యాప్తులో కొత్త విషయాలు బయటపడినట్లు సమాచారం.
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వివాహిత మహిళతో ఆయనకు సన్నిహిత పరిచయం ఉన్నట్లు గుర్తించారు. 2014లో వివాహం జరిగిన ఆ మహిళ, 2023 నుంచి తన భర్తకు దూరంగా ఉంటున్నట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో, ఆమెతో ‘లివ్-ఇన్ రిలేషన్‌షిప్’లో ఉండాలని ఉదయ్ కృష్ణారెడ్డి కోరినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. అయితే, భర్తతో చట్టబద్ధంగా విడాకులు పూర్తికాకపోవడంతో, ఆ మహిళ ఆ ప్రతిపాదనను నిరాకరించినట్లు సమాచారం.
ఈ వ్యవహారంపై పోలీసులు ఆ మహిళ నుంచి స్టేట్‌మెంట్‌ను నమోదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది. కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
ఈ ఘటనపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉన్నప్పటికీ, అకాడమీ వర్గాల్లో ఈ కేసు చర్చనీయాంశంగా మారింది.
also read: జమ్మూకశ్మీర్‌లో ప్రకృతి విలయం.. క్లౌడ్ బరస్ట్‌లతో భారీ నష్టం, 31 మంది మృతి..
