Homeక్రైమ్అక్రమ సంబంధం కోసం భర్త, అత్తను విషం పెట్టి చంపాలని చూసిన మహిళ

అక్రమ సంబంధం కోసం భర్త, అత్తను విషం పెట్టి చంపాలని చూసిన మహిళ

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం ముదక్‌పల్లిలో ఓ ఘటన కలకలం రేపింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని భావించిన ఓ వివాహిత, తన భర్తతో పాటు అత్తను హత్య చేసేందుకు ప్రణాళిక పన్నింది.

శనివారం రోజున ఆమె వండిన కూరలో విషం కలిపి ఇద్దరికీ పెట్టింది. అయితే అత్త భూదేవ్వ ఆ కూర తినగానే తీవ్ర అస్వస్థతకు గురైంది. ఇదే సమయంలో భర్త భూమన్నకు అనుమానం రావడంతో వెంటనే తినడం ఆపి పరిస్థితిని గమనించాడు. వెంటనే జరిగిన విషయాన్ని బయటపెట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

అనంతరం బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించడంతో ఆదివారం రాత్రి రిమాండ్‌కు తరలించారు.

ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కుటుంబ సంబంధాల్లో పెరుగుతున్న విభేదాలు ఇలాంటి దారుణాలకు దారి తీస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

also read: కడపలో విషాదం.. పాఠశాల వద్ద ఆత్మహత్య చేసుకున్న ఉపాధ్యాయుడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు