Homeక్రైమ్హర్యానాలో దారుణం: స్కూల్ టీచర్‌పై కత్తితో దాడి చేసి హత్య చేసిన పూర్వ విద్యార్థి

హర్యానాలో దారుణం: స్కూల్ టీచర్‌పై కత్తితో దాడి చేసి హత్య చేసిన పూర్వ విద్యార్థి

హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్ జిల్లా సిక్రోనా ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జులై 29న ఒక ప్రైవేట్ పాఠశాల వద్ద గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేసి ఉపాధ్యాయురాలు సంధ్యను హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

సమాచారం ప్రకారం, మాస్క్ ధరించిన దుండగుడు స్కూల్ వద్దకు చేరుకుని టీచర్‌ను బయటకు పిలిచాడు. ఆమె బయటకు వచ్చిన వెంటనే కత్తితో పలుమార్లు దాడి చేసి అక్కడికక్కడే తీవ్రంగా గాయపరిచాడు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు పాఠశాల పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కావడం గమనార్హం. వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

స్థానికుల సమాచారం మేరకు, ఈ కేసులో పూర్వ విద్యార్థి అమిత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు కొంతకాలంగా టీచర్‌ను వేధిస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ కోణంలోనే దర్యాప్తు కొనసాగుతోంది.

also read: బీపీ టెస్ట్‌ కోసం వేచి ఉండమన్నందుకు ఆగ్రహం.. డాక్టర్‌పై స్టూల్‌తో దాడి చేసిన పేషెంట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు