క్రైమ్ మిర్రర్, సినిమా :- సినీ పరిశ్రమలో నటీమణుల పారితోషికం ఎప్పుడూ ఆసక్తికరమైన అంశమే. తాజాగా, భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ల జాబితా విడుదలైంది. ఈ జాబితాలో బాలీవుడ్ భామలే ఆధిపత్యం చెలాయించగా, గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా అగ్రస్థానంలో నిలిచారు. అలాగే, దక్షిణాది తారలు కూడా తమ సత్తా చాటుతున్నారు.
టాప్ రేస్‌లో బాలీవుడ్ బ్యూటీలు:-సినీ వర్గాల సమాచారం ప్రకారం, ‘దేశీ గర్ల్’ ప్రియాంకా చోప్రా ఒక్కో సినిమాకు ఏకంగా రూ. 25-30 కోట్ల వరకు ఛార్జ్ చేస్తూ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్‌గా రికార్డు సృష్టించారు. హాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉండటం, అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ ఉండటమే ఆమె ఇంత భారీ పారితోషికం డిమాండ్ చేయడానికి కారణమని తెలుస్తోంది.ఆ తర్వాతి స్థానంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఉన్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ భ్యూటీ ఒక్కో చిత్రానికి రూ. 20-30 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు.మరో అగ్ర కథానాయిక ఆలియా భట్ కూడా రెమ్యునరేషన్ రేసులో గట్టి పోటీనిస్తోంది. ఆమె ఒక్కో సినిమాకు రూ. 20-25 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. సీనియర్ నటి కత్రినా కైఫ్ కూడా రూ. 15-25 కోట్లతో టాప్ లిస్ట్‌లో తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు.
దక్షిణాది తారల సత్తా:- దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో కూడా హీరోయిన్ల రెమ్యునరేషన్ భారీగానే పెరిగింది. సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార, టాలెంటెడ్ బ్యూటీ త్రిష, నేచురల్ యాక్ట్రెస్ సాయి పల్లవిలు ఒక్కో సినిమాకు సుమారు రూ. 10-12 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుండటంతో, దక్షిణాది కథానాయికలకు కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడమే ఈ భారీ రెమ్యునరేషన్‌కు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మొత్తానికి, ఒకప్పుడు కేవలం గ్లామర్‌కే పరిమితమైన హీరోయిన్లు, ఇప్పుడు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషిస్తూ, తమ క్రేజ్ కు తగ్గట్లుగా భారీ పారితోషికాలు అందుకుంటున్నారు. ముందు ముందు ఈ పారితోషికాల రేసు ఇంకెంత ఆసక్తికరంగా మారుతుందో చూడాలి.
