పెద్దపల్లి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓదెల మండల పరిధిలోని రూపు నారాయణపేట గ్రామ శివారులో ఉన్న మానేరు చెక్ డ్యాంలో ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయాడు.
శుక్రవారం మధ్యాహ్నం చేలిక ఆదిత్య అనే పదో తరగతి విద్యార్థి తన స్నేహితుడు యశ్వంత్‌తో కలిసి చెక్ డ్యాం వద్దకు వెళ్లాడు. ఈత కొడుతూ ఉండగా ప్రమాదవశాత్తూ ఆదిత్య నీటిలో మునిగిపోయాడు. వెంటనే అప్రమత్తమైన యశ్వంత్ బయటపడి ప్రాణాలు దక్కించుకున్నాడు.
స్థానికులు సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ఆదిత్యను బయటకు తీసే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే అతను మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ విషాద సంఘటనతో గ్రామంలో తీవ్ర ఆవేదన నెలకొంది.
మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గ్రామస్థులు, బంధువులు ఆదిత్య మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
also read: కీసరలో దారుణం: 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ బంధువులు– ఒకరు అదుపులో, ఇద్దరు పరారీలో
