హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో కురిసిన భారీ వర్షాలు సాధారణ జనజీవనాన్ని పూర్తిగా దెబ్బతీశాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వానల కారణంగా కొండచరియలు విరిగి పడటంతో ప్రధాన రహదారులు మూసుకుపోయాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఓ అంబులెన్స్ సిబ్బంది చూపిన ధైర్యం అందరినీ కదిలిస్తోంది. కేవలం ఏడు నెలల చిన్నారిని సురక్షిత ప్రాంతానికి తరలించాల్సిన అవసరం ఏర్పడింది. అయితే రహదారి పూర్తిగా మూసుకుపోవడంతో ప్రయాణం అసాధ్యంగా మారింది.
అయినా వెనుకడుగు వేయని ఆ సిబ్బంది సభ్యుడు, ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ చిన్నారిని చేతుల్లో ఎత్తుకుని ముందుకు సాగాడు. కొండపై నుంచి రాళ్లు జారిపడుతున్నా, ఒక్క క్షణం కూడా తడబడకుండా జాగ్రత్తగా ప్రమాద ప్రాంతాన్ని దాటించాడు. చివరకు మరో వైపున ఉన్న అంబులెన్స్ వరకు చిన్నారిని సురక్షితంగా చేర్చడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ప్రాణాలకైనా భయపడకుండా సేవచేసిన ఆ యువకుడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజమైన హీరోలు ఇలాంటివారే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
also read: అటవీ అధికారులమని చెప్పి దారుణం.. యువతిపై ముగ్గురి లైంగిక దాడి
