Homeతెలంగాణకోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో సంబంధం లేదు...!

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో సంబంధం లేదు…!

  • తేల్చి చెప్పిన రాజగోపాల్ రెడ్డి

  • మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని హెచ్చరిక

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో మంత్రి పదవి ఆశిస్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కానీ అది అందని ద్రాక్ష గానే ఉంది. అయితే తాజాగా మళ్లీ మంత్రి పదవుల ప్రస్తావన రావడంతో.. తెరపైకి వచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తన సోదరుడు వెంకట్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మేం సోదరులమే అయినా మా కుటుంబాలు వేరు.. మంత్రి వెంకట్ రెడ్డి కుటుంబం, నా కుటుంబం ఒక్కటి కాదు. మంత్రి పదవి విషయంలో ఆయనతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత పరిస్థితులపై మరోసారి చర్చకు దారి తీసాయి. గత కొంతకాలంగా మంత్రి పదవి రాకపోవడం పై తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. ఇప్పుడు మరోసారి ఇదే అంశాన్ని ప్రస్తావించి హార్ట్ టాపిక్ అయ్యారు.

మంత్రి పదవి పై ఆశ…

Also Read:ప్రీతి ముకుందన్ నిజంగా రామానుజన్ వారసురాలేనా?

రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు. కాంగ్రెస్ హై కమాండ్ ను కూడా ఆయన ఇదే కోరారు. మొన్నటి ఎన్నికలకు ముందు బిజెపి నుంచి కాంగ్రెస్లో చేరిన క్రమంలో మంత్రి పదవి హామీ పొందారు. కానీ అది దక్కకపోయేసరికి పలుమార్లు తన ఆవేదన వ్యక్తం చేశారు. అసంతృప్తిని సైతం బయట పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా అటువంటి వ్యాఖ్యలు చేశారు. తనకు పదవి అడుక్కోవడం రాదు అని.. పోరాటం చేయడమే తనకు తెలుసు అని వ్యాఖ్యానించారు. తద్వారా మంత్రి పదవి రాకుంటే ఎంతటి పోరాటానికైనా సిద్ధం అని తేల్చి చెప్పారు.

  • తరచూ అసంతృప్త వ్యాఖ్యలు…

Also Read:RAW NTR చుట్టూ వివాదం.. సాయిరూప్ క్లారిటీ ఇదే!

మొన్న ఆ మధ్యన ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి పైనే వ్యాఖ్యానించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని పక్క నుంచి వచ్చిన పార్టీ నేతలు ఏలుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో తాను సీనియర్ నాయకుడిని అంటూ చెప్పుకున్నారు. మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం జరుగుతున్న ప్రతిసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అయితే ఒకే కుటుంబంలో ఇద్దరు నేతలకు పదవులు ఇవ్వడం కుదరదు అని హైకమాండ్ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వేరు.. తాను వేరు అన్నట్టు మాట్లాడుతున్నారు. మంత్రివర్గంలో స్థానం కల్పించకపోతే ప్రతిఘటన తప్పదు అని సంకేతాలు పంపిస్తున్నారు. మరి ఆయనకు క్యాబినెట్లో చోటు దక్కుతుందా? లేదా అన్నది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు