Homeఆంధ్ర ప్రదేశ్పురుగుల మందు తాగి యువతి మృతి...! గ్రామంలో విషాదం...

పురుగుల మందు తాగి యువతి మృతి…! గ్రామంలో విషాదం…

సి. బెళగల్, క్రైమ్‌మిర్ర‌ర్‌: సి. బెళగల్ మండలం పోలకల్ గ్రామంలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొల్ల తిక్కయ్య, సుజాత దంపతుల పెద్ద కుమార్తె దీపిక (20) పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, తిక్కయ్య–సుజాత దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె దీపిక కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటోంది. వ్యక్తిగత కారణాలతో మనస్తాపానికి గురైన ఆమె గురువారం ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగినట్లు తెలుస్తోంది.

Also Read:రెబ్బెన్ లో రక్తపాతం.. రైల్వే స్టేషన్ సమీపంలో వృద్ధుడు దారుణ హత్య

దీపిక అపస్మారక స్థితిలో ఉండటాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే వైద్యుల ప్రయత్నాలు ఫలించక ఆమె మృతి చెందినట్లు తెలిసింది. యువతి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆమె నివాసానికి చేరుకుని కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పురుగుల మందు తాగడానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Also Read:హైదరాబాద్‌లో నా జ్ఞాపకాలు అక్కడే.. జెనీలియా ఎమోషనల్ పోస్ట్…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు