Homeఆంధ్ర ప్రదేశ్విశాఖ సముద్రంలో బోటు ప్రమాదం.. ఇద్దరు మత్స్యకారులకు తీవ్ర గాయాలు

విశాఖ సముద్రంలో బోటు ప్రమాదం.. ఇద్దరు మత్స్యకారులకు తీవ్ర గాయాలు

విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ సమీపంలో సముద్రంలో మరోసారి బోటు ప్రమాదం చోటుచేసుకుంది. వేట కోసం సముద్రంలోకి వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు ప్రమాదంలో చిక్కుకున్నారు. గురువారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు సమాచారం. వేట కొనసాగిస్తున్న సమయంలో మత్స్యకారుల బోటు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు మత్స్యకారులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన తోటి మత్స్యకారులు వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చి, మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం గాయపడిన ఇద్దరు మత్స్యకారులు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంపై స్థానిక మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్రంలో వేటకు వెళ్లే సమయంలో భద్రతా చర్యలు మరింత కఠినంగా అమలు చేయాలని వారు కోరుతున్నారు.
ఇటీవల కాలంలో సముద్రంలో చోటుచేసుకుంటున్న బోటు ప్రమాదాలు మత్స్యకారుల్లో భయాందోళనలు పెంచుతున్నాయి. అధికారులు ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు.

also read: బంగాళాఖాతంలో విషాదం.. రోహింగ్యాల రెండు పడవలు మునక, 500 మందికి పైగా గల్లంతు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు