ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జెర్రెల పంచాయతీ పరిధిలోని నిట్టమామిడిపాలెంలో నివసిస్తున్న ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని కటారి మేరి (16) మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది.
సమాచారం ప్రకారం, ఆమె తన ప్రియుడు ఉదయ్కిరణ్తో ఇటీవల జరిగిన వివాదం కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. సోమవారం వారిద్దరి మధ్య గొడవ జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.
ఈ ఘటనపై మృతురాలి తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల వాంగ్మూలాలను సేకరిస్తున్నారు. ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
also read: ఘనంగా పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభం.. లక్షలాది భక్తుల సందడి