ఖాట్మాండు, క్రైమ్‌మిర్రర్: నేపాల్ రాజకీయాల్లో సంచలన మార్పులతో అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న కొత్త ప్రభుత్వానికి కేవలం మూడున్నర నెలలకే తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదురవుతోంది. గత సెప్టెంబర్‌లో జెన్-జి నడిపిన ఉవ్వెత్తున లేచిన ఉద్యమం అప్పటి కేపీ శర్మ ఓలీ ప్రభుత్వాన్ని ప్పకూల్చింది. ఆ యువ విప్లవం సృష్టించిన ప్రభంజనంతోనే మార్చిలో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఏకంగా 182 స్థానాలను గెలుచుకుని చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. దీంతో కాఠ్మాండూ మాజీ మేయర్, యువ నేత బాలేంద్ర బాలెన్ షా ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టారు. కానీ, ఏ యువతైతే తమ ఆకాంక్షలను నెరవేరుస్తాడని ఆయన్ను పీఠంపై కూర్చోబెట్టిందో, ఇప్పుడు అదే యువత ఆయన తీసుకుంటున్న కఠిన నిర్ణయాలపై రోడ్లపైకి వచ్చి పోరాడుతుండటం గమనార్హం.ఈ తాజా సంక్షోభానికి కాఠ్మాండూ పాస్‌పోర్ట్ కార్యాలయం వద్ద జరిగిన గణేష్ నేపాలీ అనే యువకుడి ఆత్మహత్యే ప్రధాన కారణమైంది.
Also Read:Actress Hema: మెర్సిడెస్ బెంజ్ కారు కొన్న నటి హేమ.. సోషల్ మీడియాలో రచ్చ!
దుబాయ్ వెళ్లాలనే కలలతో ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న ఆ రైడ్-షేరింగ్ కార్మికుడి బైక్ ను పోలీసులు లాక్ చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురై పెట్రోల్ పోసుకుని ఆత్మబలిదానం చేసుకున్నాడు. వారం రోజుల ముందే పోలీసులు అతని బైక్‌ను సీజ్ చేసి 1,000 జరిమానా విధించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు, ఎలాంటి ప్రత్యామ్నాయ పునరావాసం చూపించకుండా దాదాపు 2,600 మంది భూమిలేని పేద కుటుంబాలను నిర్వాసితులను చేయడం, వరదల్లో స్వచ్ఛందంగా సేవలు అందించిన యువతపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో జనం ఆగ్రహం కట్టలు తెంచుకుంది.కాఠ్మాండూ మేయర్‌గా ఉన్నప్పుడు అక్రమ కట్టడాల కూల్చివేతలతో పాపులారిటీ తెచ్చుకున్న ఆయన, అదే బుల్డోజర్ తరహా క్లీనప్ పాలనను జాతీయ స్థాయిలో రుద్దాలని చూస్తూ పేదల పొట్టకొడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
Also Read:Supreme Court: ప్రేమగా దగ్గరైతే పోక్సో కేసా? సుప్రీంకోర్టు షాకింగ్ కామెంట్స్!
పెద్దల అవినీతిని అంతమొందించి, ఉద్యోగాలు కల్పిస్తారనే నమ్మకంతో యువత ఓటేస్తే.. ప్రభుత్వం మాత్రం కఠినమైన ట్రాఫిక్ నిబంధనలు, భారీ జరిమానాలతో చిరు వ్యాపారులు, వలస కార్మికులను వేధిస్తోందనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఒకే తప్పుకు మున్సిపల్ పోలీసులు 1,000, ట్రాఫిక్ పోలీసులు 500 చొప్పున వేర్వేరు చట్టాల కింద జరిమానాలు వసూలు చేస్తుండటం ఇక్కడి వ్యవస్థాగత గందరగోళానికి అద్దం పడుతోంది.ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ ఎన్ఫోర్స్మెంట్ సంస్కృతిని నిర్మించింది స్వయంగా మాజీ మేయర్ అయిన ప్రధాని బాలెన్ షాయే.
Also Read:Black Magic: కోర్టులో న్యాయమూర్తిపై చేతబడి.. 65 ఏళ్ల వృద్ధురాలు అరెస్ట్!
సంక్షోభం ఇంతలా ముదురుతున్నా ప్రధాని మౌనం వహించడం, కేవలం సోషల్ మీడియా ఇమేజ్‌తోనే దేశాన్ని నడపలేరని విమర్శకులు విమర్శిస్తున్నారు. రోజుకు 1,500 మంది ఉపాధి కోసం దేశం విడిచిపోతున్న నేపాల్ దయనీయ స్థితికి గణేష్ నేపాలీ ఉదంతం ఒక ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. అయితే పదవి చేపట్టి కొద్ది నెలలు కాక ముందే అద్భుతాలు చేసేయాలని అనుకోవడం కష్టమని జెన్ జీ భావించడం లేదు. అక్కడే సమస్య వస్తోంది.