Homeసినిమావిజయ్ ‘జన నాయకగన్’ ఎఫెక్ట్.. తమిళ సినిమా రిలీజ్ షెడ్యూల్ మొత్తం షేక్!

విజయ్ ‘జన నాయకగన్’ ఎఫెక్ట్.. తమిళ సినిమా రిలీజ్ షెడ్యూల్ మొత్తం షేక్!

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయకగన్’ విడుదల తేదీ ప్రకటించడంతో కోలీవుడ్‌లో ఒక్కసారిగా హడావుడి నెలకొంది. జూలై 24న ఈ సినిమా థియేటర్లలోకి రానుండగా, దాని ప్రభావం ఇతర సినిమాలపై స్పష్టంగా కనిపిస్తోంది. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రంతో నేరుగా పోటీ పడకుండా ఉండేందుకు నిర్మాతలు తమ ప్లాన్లను మార్చుకుంటున్నారు.

మొదటగా జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ‘ఇమ్మోర్టల్’ సినిమా జూలై 23న విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు ఆ తేదీని వాయిదా వేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటించనున్నారు.

ఇక మరోవైపు జూలై 31న విడుదల చేయాలని ప్లాన్ చేసిన ‘డీసీ’, ‘సిగ్మా’ సినిమాలు కూడా తమ నిర్ణయాన్ని పునఃసమీక్షిస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘జన నాయకగన్’ క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాలు కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని అంచనా.

అయితే ప్రస్తుతం ‘అన్బే డయానా’ సినిమా మాత్రం జూలై 17న రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంపై ప్రభావం పడే అవకాశం తక్కువగా కనిపిస్తోంది.

విజయ్ కెరీర్‌లో చివరి సినిమా కావడంతో ‘జన నాయకగన్’పై అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. దీంతో ఇతర సినిమాలు రిస్క్ తీసుకోకుండా తమ విడుదల తేదీలను మార్చుకోవడం మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలతో జూలై చివరి వారంలో తమిళ సినిమా రిలీజ్ క్యాలెండర్‌లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.

also read: డబ్బు మొత్తం కూతురికే ఇస్తుందన్న కోపంతో భార్యను హత్య చేసిన భర్త..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు