Friday, February 27, 2026
Homeక్రైమ్నిజామాబాద్ మేయర్ భర్త‌పై సుత్తితో దాడి

నిజామాబాద్ మేయర్ భర్త‌పై సుత్తితో దాడి

నిజామాబాద్ నగరంలో దారుణం జరిగింది. అందరూ చూస్తిండగానే.. నడి కోడ్డుపై నగర్ మేయర్ భర్త పై ఆటో డ్రైవర్ దాడి చేశాడు. సుత్తితో కొట్టడంతో మేయర్ భర్త తలపగిలింది. నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ భర్త మాజీ కార్పొరేటర్ శేఖర్ పై ఒక ఆటో డ్రైవర్ దాడి చేసిన సంఘటన కలకలం రేపుతోంది.

స్థానిక నాగారంలోని అక్కడి కార్పొరేటర్ కు సంబంధించిన కార్యాలయం వద్ద ఆటో డ్రైవర్ సుత్తితో దాడి చేసి కొట్టడంతో శేఖర్ కింద పడిపోయాడు. అక్కడ చేరుకున్న ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఓ వివాదానికి సంబంధించిన అంశంపై మాట్లాడేందుకు ఉదయమే మేయర్ భర్త కార్యాలయానికి వచ్చారని తెలుస్తోంది. అక్కడ వాగ్వాదం జరుగుతుండగానే ఆటోలో ఉన్న సుత్తిని తీసుకొచ్చి మేయర్ భర్తపై ఆటో డ్రైవర్ దాడి చేశాడు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments