Homeసినిమాఓటీటీకి వచ్చేసిన 'పెద్ది': అదనపు సన్నివేశాలతో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

ఓటీటీకి వచ్చేసిన ‘పెద్ది’: అదనపు సన్నివేశాలతో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

క్రైమ్ మిర్రర్, సినిమా:- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన హీరోగా నటించిన తాజా బ్లాక్‌బస్టర్ మూవీ ‘పెద్ది’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.కొత్త సన్నివేశాలతో..థియేటర్లలో ప్రదర్శితమైన వెర్షన్‌కు కాస్త భిన్నంగా, కొత్తగా యాడ్ చేసిన కొన్ని అదనపు సన్నివేశాలతో ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ అందుబాటులోకి తీసుకురావడం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మరియు మలయాళ భాషల్లో వీక్షకులకు అందుబాటులో ఉంది.చిత్ర బృందం:’ఉప్పెన’ ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఈ స్పోర్ట్స్ అండ్ యాక్షన్ డ్రామాను తెరకెక్కించగా, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ మూవీకి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. అలాగే కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, సీనియర్ నటుడు జగపతిబాబు, బాలీవుడ్ నటులు దివ్యేందు, బోమన్ ఇరానీ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు, అలాగే అదనపు సన్నివేశాలతో మరోసారి చూడాలనుకునే వారు ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు.

Fresh US Strikes on Iran: ఇరాన్‌పై అమెరికా దాడి.. ట్రంప్ యాక్షన్ మళ్లీ మొదలైంది!

India vs England 4th T20: డూ ఆర్ డై మ్యాచ్.. నాలుగో టీ20లో ఇంగ్లండ్‌కు టీమిండియా షాకిచ్చేనా?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు