క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ భారత క్రికెట్ జట్టు కాంబినేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యువ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవాలని ఆయన మేనేజ్‌మెంట్‌కు సూచించారు. ప్రస్తుత జట్టు వ్యూహాల్లో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.భారత జట్టు బ్యాటింగ్ లైన్-అప్‌లో టాప్ ఆర్డర్‌లో ఇద్దరు ఎడమచేతి వాటం (లెఫ్ట్ హ్యాండ్) బ్యాటర్లను ఆడించడం అంతగా వర్కవుట్ కాదని కైఫ్ విశ్లేషించారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటే, ప్రస్తుతం ఓపెనింగ్‌గా వస్తున్న అభిషేక్ శర్మ, సూర్యవంశీ కాంబినేషన్‌ను మార్చడం మంచిదని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో నేడూ తేలికపాటి వర్షాలే.. వాతావరణ నిపుణుల అంచనాతో ప్రజల్లో ఆందోళన!
అభిషేక్, సూర్యవంశీలలో ఒకరిని మాత్రమే ఓపెనర్‌గా ఉంచి, మరొకరి స్థానంలో సంజూ శాంసన్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించాలని కైఫ్ సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఈ విధమైన మార్పు జట్టుకు మరింత సమతూకాన్ని ఇస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.మేనేజ్‌మెంట్‌కు విజ్ఞప్తి..జింబాబ్వే సిరీస్‌కు పక్కన పెట్టిన సంజూ శాంసన్‌ను తిరిగి జట్టులోకి తీసుకొచ్చే మార్గాలను అన్వేషించాలని కైఫ్ టీమ్ మేనేజ్‌మెంట్‌ను కోరారు. శాంసన్ లాంటి ప్రతిభావంతుడైన ఆటగాడు జట్టులో ఉండడం ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు. మరి కైఫ్ చేసిన ఈ సూచనలపై టీమ్‌ఇండియా యాజమాన్యం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.