Homeసినిమాబోనీ కపూర్ ఇంట పెళ్లి సందడి.. అన్షులా కపూర్ వెడ్డింగ్ వేడుకలు షురూ..

బోనీ కపూర్ ఇంట పెళ్లి సందడి.. అన్షులా కపూర్ వెడ్డింగ్ వేడుకలు షురూ..

బాలీవుడ్‌లో మరో స్టార్ వెడ్డింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కుటుంబంలో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఆయన పెద్ద కుమార్తె అన్షులా కపూర్ తన లాంగ్‌టైమ్ పార్టనర్ రోహన్ థక్కర్‌తో త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే ముంబైలో ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా ప్రారంభమై, కపూర్ ఫ్యామిలీ మొత్తం ఉత్సాహంగా పాల్గొంటోంది.

గత ఏడాది న్యూయార్క్‌లో సన్నిహితుల మధ్య నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, జూలై 6న పెళ్లి పీటలెక్కనుంది. ఈ నేపథ్యంలో మొదటి కార్యక్రమంగా సంప్రదాయబద్ధమైన ‘మాతా కీ చౌకీ’ పూజను నిర్వహించారు. రోహన్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఇరు కుటుంబాలవారు పాల్గొని ఆశీస్సులు అందించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను అన్షులా సోషల్ మీడియాలో పంచుకుంటూ, ప్రేమ, కుటుంబం, ఆశీర్వాదాలతో తమ కొత్త ప్రయాణం ప్రారంభమవుతోందని భావోద్వేగంగా వెల్లడించింది.

ఈ పెళ్లి వేడుకల్లో అన్షులా అన్న అర్జున్ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తల్లి మోనా శౌరీ కపూర్ మరణం తర్వాత చెల్లెలికి అండగా నిలిచిన అర్జున్, ఇప్పుడు పెళ్లి ఏర్పాట్లను కూడా స్వయంగా చూసుకుంటూ కుటుంబ బాధ్యతలను నెరవేర్చుతున్నాడు. అలాగే, ఒకప్పుడు దూరంగా ఉన్నట్లు భావించిన జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లతో అన్షులా, అర్జున్‌ల అనుబంధం ఇప్పుడు మరింత బలపడింది. శ్రీదేవి మరణం తర్వాత ఈ నాలుగు మంది తోబుట్టువులు దగ్గరయ్యారు. ప్రస్తుతం అన్షులా వెడ్డింగ్ వేడుకల్లో అందరూ కలిసిమెలిసి పాల్గొంటూ ఆ బంధాన్ని మరింత స్పష్టంగా చూపిస్తున్నారు.

జాన్వీ, ఖుషీ కపూర్‌లు పెళ్లి ఏర్పాట్లలో చురుకుగా పాల్గొంటూ అక్కకు అండగా నిలుస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి డాన్స్‌లు చేస్తూ, సరదాగా గడుపుతూ వేడుకల్లో సందడి చేస్తున్నారు. సోనమ్ కపూర్, రియా కపూర్‌లతో కలిసి తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇటీవల నిర్వహించిన స్పెషల్ డిన్నర్ పార్టీలో సంజయ్ కపూర్, మహీప్ కపూర్‌తో పాటు కపూర్ కుటుంబ సభ్యులు హాజరై సందడి చేశారు. బాలీవుడ్ యంగ్ జనరేషన్ సెలబ్రిటీలు కూడా ఈ వేడుకల్లో పాల్గొని ఆకట్టుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన జాన్వీ కపూర్ తన అక్క పెళ్లి వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం కపూర్ కుటుంబంలో పెళ్లి సంబరాలు పీక్స్‌లో ఉండగా, జూలై 6న జరిగే ఈ గ్రాండ్ వెడ్డింగ్‌పై అందరి దృష్టి నిలిచింది.

also read: ఒక్క షాపింగ్ ఈ అమ్మాయి జీవితాన్నే మార్చేసింది… రూ.13 వేలతో… కోట్ల విలువైన ఇల్లు గెలుచుకుంది!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు