Homeతెలంగాణనరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలన సందర్భంగా విద్యార్థులకు ఆర్కేఎస్ ఫౌండేషన్ ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ!

నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలన సందర్భంగా విద్యార్థులకు ఆర్కేఎస్ ఫౌండేషన్ ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ!

నల్లగొండ: భారత ప్రధానిగా నరేంద్రమోడీ 12 సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆర్ఎస్కే ఫౌండేషన్  ఆధ్వర్యంలో నల్లగొండలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోట్‌బుక్స్, పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, నల్లగొండ కంటెస్టెడ్ ఎమ్మెల్యే పిల్లి రామరాజు యాదవ్, హుజూర్‌నగర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు. నల్లగొండ డీవీకే రోడ్డులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 400 మంది విద్యార్థులకు విద్యా సామగ్రిని అందించారు. విద్యార్థులకు నోట్‌ బుక్స్‌ తో పాటు పెన్నులు, పెన్సిళ్లు, ఎగ్జామ్ ప్యాడ్స్‌ ను పంపిణీ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు.

పుట్టిన రోజు సందర్భంగా రామరాజు వినూత్న పిలుపు

ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా పిల్లి రామరాజు యాదవ్ ఒక ప్రత్యేక పిలుపునిచ్చారు. తనకు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శాలువాలు, బొకేలు తీసుకురావడం కంటే విద్యార్థులకు ఉపయోగపడే నోట్‌బుక్స్, పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్స్ అందించాలని కోరారు. ఆయన పిలుపుకు భారీ స్పందన లభించింది. ఈ పిలుపు మేరకు సుమారు 2,000 నోట్‌బుక్స్, 4,000 పెన్నులు, 100 ఎగ్జామ్ ప్యాడ్స్ వచ్చాయి. వాటిని శానంపూడి సైదిరెడ్డితో కలిసి పిల్లి రామరాజు యాదవ్ విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు.

ఆర్కేఎస్ ఫౌండేషన్ సేవలను అభినందించిన సైదిరెడ్డి

ఈ సందర్భంగా మాట్లాడిన శానంపూడి సైదిరెడ్డి, ఆర్కేఎస్ ఫౌండేషన్ అందిస్తున్న సేవలను అభినందించారు. విద్యార్థుల నుంచి పేదల వరకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థులకు విద్యా సామగ్రి అందించడం ఆనందంగా ఉందని సైదిరెడ్డి అన్నారు. గత 12 ఏళ్లలో దేశ అభివృద్ధికి ప్రధాని మోడీ అహర్నిశలు కృషి చేశారని, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థులకు డిజిటల్ సేవలను అందిస్తూ వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

పార్టీ కార్యకర్తలు, అభిమానులకు రామరాజు కృతజ్ఞతలు

పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు కోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. తన పుట్టినరోజు సందర్భంగా స్పందించి విద్యార్థులకు ఉపయోగపడే సామగ్రిని అందించిన పార్టీ కార్యకర్తలు, మిత్రులు, అభిమానులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సమాజ సేవలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఆనందాన్ని నింపడమే కాకుండా, విద్యకు అవసరమైన ప్రోత్సాహాన్ని కూడా అందించిందని పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో విపస్య విద్యా సంస్థల చైర్మెన్ బండారు ప్రసాద్, ఆర్కేఎస్ కమిటీ మెంబర్, 10వ డివిజన్ కార్పోరేటర్ పిల్లి కృష్ణం రాజు యాదవ్, ఆర్కేఎస్ కమిటీ మెంబర్ పిల్లి శివరాజు, 25వ డివిజన్ కార్పొరేటర్ నవ్యశ్రీ రాఖీ, 39వ డివిజన్ కార్పొరేటర్ దాసరి సాయి, స్కూల్ ప్రధానోపాధ్యాయుడు యూసుఫ్ ఉద్దీన్, బీజేపీ సీనియర్ నాయకులు పోతెపాక సాంబయ్య, మాజీ కౌన్సిలర్ ఊట్కూరు వెంకట్ రెడ్డి, బీజేపీ నాయకులు యాణాల కరుణాకర్ రెడ్డి, కందుల శ్రీను, పర్వతం శరత్, లగడపురం వెంకన్న, ఈశ్వర్, కొప్పు సంతోష్, రవి నాయక్, చిన్నాల ఆంజనేయులు, ఆర్కేఎస్ సభ్యులు శ్రీధర్ రెడ్డి, జాన్ రెడ్డి, ఉపేందర్, పిల్లి కోటేష్, సైదులు, మర్రి కొండలు, దుబ్బాక మల్లేష్, అన్నపూర్ణ సేవాభారతి శ్రీకాంత్ పాల్గొన్నారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు