డెహ్రాడూన్, క్రైమ్‌మిర్రర్: ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న 23 ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పన్నెండో తరగతిలో పాఠశాల టాపర్‌గా నిలిచిన సదరు విద్యార్థిని, తన నివాసంలోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. “అమ్మా, నాన్నా ఐ లవ్ యూ.. నా మరణానికి ఎవరూ కారణం కాదు” అని హిందీలో రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read:FSSAI: తుప్పుపట్టిన కత్తులు వాడితే తుప్పురేగిపోద్ది.. హోటళ్లు, రెస్టారెంట్లకు FSSAI వార్నింగ్!
పోలీసుల కథనం ప్రకారం, మృతురాలిని కార్గిల్ యుద్ధ వీరుడు రాజేష్ థాపా కుమార్తె రియా కుమారి థాపాగా గుర్తించారు. మంగళవారం ఉదయం 11:30 గంటల సమయంలో భోజనానికి పిలిచినా ఆమె గది నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు తలుపులు బద్దలు కొట్టి చూడగా, రియా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. సాధారణంగా ఆమె రాత్రి వేళల్లో పొద్దుపోయే వరకు చదువుకుని, ఉదయం ఆలస్యంగా నిద్రలేచే అలవాటు ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.జూన్ 21న జరగనున్న నీట్ రీ-ఎగ్జామినేషన్ కోసం రియా సిద్ధమవుతున్నట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంకిత్ కందారి వెల్లడించారు.
Also Read:PM Kisan Update: రైతుల ఖాతాల్లో మళ్లీ పీఎం కిసాన్ నగదు.. ఎప్పుడు వేస్తారంటే?
మొదటి ప్రయత్నంలో నీట్ అర్హత సాధించలేకపోవడంతో చదువుపై ఏర్పడిన తీవ్ర ఒత్తిడి, నిరాశ కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. పన్నెండో తరగతిలో 97 శాతం మార్కులు సాధించిన రియా, చదువులో ఎంతో ప్రతిభావంతురాలని తెలిసింది.ఈ ఘటనలో ఎలాంటి కుట్ర కోణం లేదని, దీనిని ఆత్మహత్యగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. పోటీ పరీక్షల ఒత్తిడి కారణంగా విద్యార్థులు ఇలా బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
Also Read:జాతీయవాదం సరిపోతుందా? దక్షిణంలో జనసేనకు అసలు పరీక్ష మొదలైంది?