Homeసినిమా‘లెనిన్‌’ విడుదల మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్‌ ఫిక్స్ చేసిన నాగార్జున

‘లెనిన్‌’ విడుదల మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్‌ ఫిక్స్ చేసిన నాగార్జున

అఖిల్‌ అక్కినేని హీరోగా తెరకెక్కుతున్న ‘లెనిన్‌’ సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే పలుమార్లు రిలీజ్‌ డేట్‌ మారిన ఈ చిత్రం జూన్‌ 26న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా, ఇప్పుడు ఆ తేదీ నుంచి వాయిదా పడింది.

ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. సినిమా టీమ్‌ తమ దగ్గరకు వచ్చి చిన్న అభ్యర్థన చేసినట్లు ఆయన తెలిపారు. సినిమా అవుట్‌పుట్‌ను మరింత మెరుగుపరచడానికి, కొత్తదనంతో ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతి ఇవ్వడానికి ఇంకాస్త సమయం అవసరమని వారు కోరినట్లు చెప్పారు.

టీమ్‌ చూపించిన పాషన్‌, డెడికేషన్‌ చూసి ఆ అభ్యర్థనను అంగీకరించానని నాగార్జున పేర్కొన్నారు. దీంతో ‘లెనిన్‌’ సినిమా కొత్త విడుదల తేదీని జూలై 10గా నిర్ణయించారు. ఈసారి ప్రేక్షకులు కొత్త అఖిల్‌ను చూస్తారని, సినిమా ఒక ప్రత్యేక అనుభవాన్ని అందిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ చిత్రంలో అఖిల్‌ సరసన భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నాగార్జునతో పాటు సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. విడుదల వాయిదా పడినప్పటికీ, సినిమా మీద ఉన్న ఆసక్తి మాత్రం మరింత పెరుగుతోంది.

also read: చేపల వేటలో విషాదం: చెరువులో మునిగి మత్స్యకారుడు మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు