Homeఆంధ్ర ప్రదేశ్అక్ర‌మ సంబంధం మోజు... ప్రియుడితో క‌లిసి భ‌ర్త‌ను హ‌త్య చేసిన భార్య‌...!

అక్ర‌మ సంబంధం మోజు… ప్రియుడితో క‌లిసి భ‌ర్త‌ను హ‌త్య చేసిన భార్య‌…!

కాకినాడ, క్రైమ్ మిర్ర‌ర్‌: భర్తను భార్య తన ప్రియుడితో కలిసి హతమార్చిన ఘటన సర్పవరం లో చోటు చేసుకుంది. మార్చి 13న దుర్గాప్రసాద్ మృతి చెందాడు. భర్త గుండెపోటుతో చనిపోయినట్లు భార్య రమాదేవి నమ్మించింది. రమాదేవికి ఇన్స్టాగ్రామ్ లో బాపట్ల జిల్లా చెరుకుపల్లికి చెందిన గోపిసాయి పరిచయమయ్యాడు. తరువాత అది అక్రమ సంబంధానికి దారి తీసింది. తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భార్య జ్యూస్ లో నిద్ర మాత్రలు కలిపి భర్తకు ఇచ్చింది.

Also Read:ఇలాంటి స్నేహితులతో జాగ్రత్త.. అప్పు ఇవ్వలేదని స్నేహితుని దారుణ హత్య!!

దుర్గా ప్రసాద్ స్పృహ తప్పి పడిపోయిన అనంతరం దిండుతో ఊపిరి ఆడకుండా చేసి భార్య, ప్రియుడు చంపివేసారు. 20 రోజుల కిందట మృతుడు కుమార్తెకు నిద్ర మాత్రల కొనుగోలు బిల్లులు, ప్రిస్కిప్షన్ ప్రియుడు పంపాడు. అనుమానంతో కుటుంబ సభ్యులకు మృతుడు కూతురు చూపించింది. విషయం పోలీసులకు చేరింది. కాల్ డేటా రికార్డులు, వాట్సాప్ చాటింగ్ ఫోరెన్సిక్ పరీక్షలు, మరిన్ని సాక్ష్యాలు సేకరించిన పోలీసులు రమాదేవి, గోపి సాయి నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

Also Read:“ముంబై ఖర్చులు భరించలేను…” – వరవరరావు విజ్ఞప్తిపై హైకోర్టు కీలక నిర్ణయం?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు