Homeతెలంగాణబిగ్ బాస్ సీజన్ 10 వచ్చేస్తోంది...ఈసారి సస్పెన్స్ అదే...!

బిగ్ బాస్ సీజన్ 10 వచ్చేస్తోంది…ఈసారి సస్పెన్స్ అదే…!

Crime Mirror, Big Boss Updates: తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా నిర్వహిస్తూ వస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ పదో సీజన్ వచ్చేస్తోంది. కొద్దిరోజుల్లోనే 10వ సీజన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే బిగ్ బాస్ 10వ సీజన్ సంబంధించిన ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గడిచిన కొన్ని సీజన్ల నుంచి ఈ రియాలిటీ షోకు హోస్టుగా వ్యవహరిస్తున్న నాగార్జున పదో సీజన్ కు సంబంధించిన విషయాలను వెల్లడించారు.

ఈ మేరకు నిర్వాహకులు ఒక వీడియోను విడుదల చేశారు. ఈ పదో సీజన్ కు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇకపోతే నిర్వాహకులు విడుదల చేసిన వీడియోలు నాగార్జున చెప్పిన డైలాగులు అదరగొడుతున్నాయి. దీంతో బిగ్ బాస్ 10వ సీజన్ పై సర్వత్ర ఆసక్తి నెలకొనేలా చేసింది ఈ వీడియో.

పదో సీజన్ కు సంబంధించిన ఈ వీడియోలో కీలక విషయాలను నాగార్జున చెప్పారు. అయితే పదో సీజన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అన్నదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దీంతో పదో సీజన్ పై సర్వత్ర ఆసక్తి నెలకొన్నట్లు అయింది.

రాజ్యం మాత్రమే కాదు.. మహా సామ్రాజ్యం అన్న నాగార్జున..

బిగ్ బాస్ పదో సీజన్ కు సంబంధించి నిర్వాహకులు విడుదల చేసిన వీడియోలు నాగార్జున మాట్లాడారు. ఇందులో నాగార్జున మాట్లాడుతూ ‘బిగ్ బాస్ ఎన్నో యుద్ధాలు గెలుచుకున్న రాజ్యం మాత్రమే కాదు. ఎంతోమంది హృదయాలను గెలుచుకున్న మహా సామ్రాజ్యం’ అంటూ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంది. ఈ డైలాగ్ తోనే వీడియో ప్రారంభమైంది.

అత్యంత ఆసక్తిగా కనిపించిన ఈ వీడియో పదో సీజన్ మరింత ఆసక్తిగా ఉంటుంది అన్న విషయాన్ని నిర్ధారించింది. నాగార్జున తో విడుదల చేసిన ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. చెదరని ప్రస్థానం, తరగని అభిమానం బిగ్ బాస్ సొంతం. ఈ ప్రస్థానం ఇంకో కొత్త చాప్టర్ కు సాక్ష్యం కాబోతోంది.

ఈసారి మీరు చూడబోయేది బిగ్ బాస్ దశావతారం అంటూ ఈ సీజన్ పై ఆసక్తిని పెంచారు నిర్వాహకులు. ప్రతి సీజన్లో ఏదో ఒక క్యాప్షన్ తో వచ్చే బిగ్ బాస్.. ఈసారి ఆటతో సవాల్ కాదు ఆటే ఒక సవాల్ అనే క్యాప్షన్ తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. బిగ్ బాస్ కు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించిన నాగార్జున, నిర్వాహకులు షో ఎప్పటినుంచి ప్రారంభమవుతుందని విషయాన్ని చెప్పలేదు.

అదేవిధంగా పదో ఎడిషన్ లో కంటెస్టెంట్స్ ఎవరు అన్నదాని పైన కూడా నిర్వాహకులు గోప్యతను పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పదో సీజన్ పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో పదో సీజన్ లో సోషల్ మీడియా ఇన్ఫ్లోర్స్ గా ఉన్న పలువురు కంటెస్టెంట్స్ గా ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది. మరి మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎంతవరకు షో మొదలైతే గాని తెలియదు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు