క్రైమ్ మిర్రర్,తెలంగాణ :- తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపానికి శాసనమండలి సభ్యులు, తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొ.కోదండరాం పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను స్మరించుకున్నారు. వారి త్యాగాలు, పోరాట స్ఫూర్తి తెలంగాణ సమాజానికి చిరస్మరణీయమని పేర్కొన్నారు. అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ అభివృద్ధి, సామాజిక న్యాయం, ప్రజాస్వామిక విలువల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టి.జె.ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవా వేడుకలు
Papaya in Breakfast: ఉదయాన్నే ఈ ఒక్క పండు తింటే అందం, ఆరోగ్యం మీ సొంతం…!