Homeతెలంగాణటార్గెట్ ఫిక్స్ చేసిన చిచ్చ‌ర పిడుగు చిన్నోడు...! ఆ రికార్డు బ్రేక్‌ చేయడమే లక్ష్యమని వ్యాఖ్య...

టార్గెట్ ఫిక్స్ చేసిన చిచ్చ‌ర పిడుగు చిన్నోడు…! ఆ రికార్డు బ్రేక్‌ చేయడమే లక్ష్యమని వ్యాఖ్య…

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌: వైభవ్‌ సూర్యవంశీ 15 ఏళ్లు కూడా నిండని ఈ కుర్రాడు తాజా ఐపీఎల్‌లో పరుగులు సునామీ సృష్టిస్తున్నాడు. కొడితే సిక్స్‌,ఫోర్‌ అన్నట్టుగా బ్యాటింగ్‌ చేస్తూ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకపడుతున్నాడు. ఈ సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ అధరగొడుతున్నాడు. భయమన్నదే లేదన్నట్టుగా ఆడుతూ వరల్డ్‌ క్లాస్‌ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ యంగ్‌ క్రికెటర్‌ తాజాగా ఇంగ్లాడ్‌ మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20లో డబుల్‌ సెంచరీ సాధించడమే తన లక్ష్యమంటూ వ్యాఖ్యానించిన వైభవ్‌.. 20 ఓవర్లపాటు ఉంటూ ఇది సాధ్యమేనని స్పష్టం చేశాడు.

బ్యాటింగ్‌ ఫస్ట్‌ చేయడం ఇష్టమా.? బౌలింగ్‌ కోరుకోవడం ఇష్టమా.? అని పీటర్సన్‌ ప్రశ్న అడగ్గా.. ఏదైనా ఒకే అంటూ సమాధానమిచ్చాడు. టీ20ల్లో క్రిస్‌ గేల్‌ చేసిన 175 పరుగులు రికార్డు గురించి పీటర్సన్‌ ప్రశ్నించగా.. దాన్ని అధిగమించడంతోపాటు 200 పరుగులు చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశాడు. ఈ లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటానని వైభవ్‌ కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. ఈ సీజన్‌లో వైభవ అద్భుత ప్రదర్శనతో రాజస్థాన్‌ రాయల్స్‌ ప్లే ఆఫ్‌కు అర్హత సాధించింది. కెవిన్‌ పీటర్సన్‌ యూట్యూబ్‌ షో ది స్విచ్‌లో నిర్వహించిన ఇంటర్వ్యూలో వైభవ్‌ ఈ కామెంట్స్‌ చేశాడు.

77 సిక్సర్లు….

వైభవ్‌ సూర్యవంశీ తాజా ఐపీఎల్‌లో అధరగొడుతూ క్రికెట్‌ అభిమానులను సంభ్రమాశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 21 మ్యాచులు ఆడిన వైభవ్‌.. 223.87 సగటుతో 835 పరుగులు సాధించాడు. వీటిలో రెండు శతకాలు, నాలుగు అర్థ శతకాలు ఉన్నాయి. వ్యక్తిగత అత్యధిక స్కోర్‌ 103 కాగా, ఇప్పటి వరకు 77 సిక్సర్లను బాది బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ సీజన్‌లో 14 మ్యాచులు ఆడిన వైభవ్‌.. 41.64 యావరేజ్‌, 232.27 స్ర్టైక్‌ రేట్‌తో 583 పరుగులు సాధించి టాప్‌ స్కోరర్‌ జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు.

ఈ జాబితాలో సాయి సుదర్శన్‌ 638 పరుగులతో టాప్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 50 ఫోర్లు కొట్టిన సూర్యవంశీ.. 53 సిక్సర్లను బాది బౌలర్లపై తన ఆధిపత్యాన్ని చూపించాడు. ఈ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొటిన ఆటగాడిగా వైభవ్‌ నిలిచాడు. మిగిలిన మ్యాచుల్లోనూ రాణించడం ద్వారా ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సులు కొట్టిగా ఆటగాడిగా సరికొత్త రికార్డును సృష్టించేందుకు వైభవ్‌ సిద్ధమవుతున్నాడు. తాజాగా టీ20లో డబుల్‌ సెంచరీ చేస్తాన్న వైభవ్‌ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు