Homeఆంధ్ర ప్రదేశ్భోగాపురం విమానాశ్రయం రెడీ.. జూలై నుంచి సేవలు ప్రారంభం

భోగాపురం విమానాశ్రయం రెడీ.. జూలై నుంచి సేవలు ప్రారంభం

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్లో శరవేగంగా నిర్మితమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమైంది. దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయాల్లో ఒకటిగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ విమానాశ్రయ సేవలు జూలై నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. శరవేగంగా నిర్మితమవుతున్న ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విమానాశ్రయాన్ని విజయనగరం జిల్లా భోగాపురం నిర్మించిన విషయం తెలిసిందే. భోగాపురం విమానాశ్రయాన్ని జూలై 8న ప్రారంభిస్తున్నట్లు సింగపూర్ కు చెందిన స్కూట్ ఎయిర్ లైన్స్ సంస్థ ప్రకటించింది. తమ సంస్థ విమాన సర్వీసులు ప్రస్తుత విశాఖపట్నం విమానాశ్రయం నుంచి కాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి నడుస్తాయని తన ట్రావెల్ ఏజెంట్లకు లేక రాసింది. దీని ప్రకారం జులై ఐదో తేదీన విమానాశ్రయం ప్రారంభం అవుతుందని, ఎనిమిది నుంచి విమానాల నడుస్తాయని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. దీనిని బట్టి జూలై 5 నుంచి 8వ తేదీ మధ్య విమానాశ్రయం ప్రారంభం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మౌలిక వసతులు కల్పన జోరుగా..

ఇప్పటికే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధం కావడంతో మౌలిక వసతుల కల్పనపైన ప్రభుత్వం పెద్ద ఎత్తున దృష్టి సారించింది. ముఖ్యంగా విమానాశ్రయానికి వెళ్లడానికి అనుగుణంగా రహదారులను ఏర్పాటు చేసే పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. విశాఖపట్నం నుంచి భోగాపురం వెళ్లాలంటే జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి. సిగ్నల్స్ కూడా ఎక్కువే. ప్రస్తుత పరిస్థితుల్లో 50 కిలోమీటర్ల ప్రయాణానికి కనీసం 70 నుంచి 90 నిమిషాలకుపైగా సమయం పడుతుంది. ఈ సమయం తగ్గించడానికి ఇతర మార్గాల్లో విమానాశ్రయం చేరుకునేందుకు అనుగుణంగా వి.ఎం.ఆర్.డి ఏడు మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణం చేపట్టింది. అందులో మూడు రహదారుల నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగిలిన నాలుగు రహదారులను కూడా విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముందే జూన్ నెలాఖరుకు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. అలాగే విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి వెళ్లడానికి అనుగుణంగా ఎలక్ట్రికల్ బస్సులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విశాఖ నుంచి భోగాపురం టాక్సీలో వెళ్లాలంటే కనీసం రూ.2000 వరకు ఖర్చు అవుతుందని ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. టాక్సీలకు బదులుగా భోగాపురం విమానాశ్రయం చేరడానికి ఏసు బస్సులు ఏర్పాటు చేయాలని ఏపీ విమాన ప్రయాణికుల సంఘం ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై మంత్రి లోకేష్ స్పందించి విశాఖ కేటాయించిన 100 ఎలక్ట్రిక్ బస్సుల్లో 20 భాగాపురం విమానాశ్రయానికి నడుపుతామని ప్రకటించారు వాటిని కూడా త్వరగా రప్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు