HomeజాతీయంCM Vijay: ఆ మూడు ఫైళ్లపై విజయ్ సంతకం...!

CM Vijay: ఆ మూడు ఫైళ్లపై విజయ్ సంతకం…!

  • ఇకనుంచి తమిళనాడులో 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం

  • మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ రెండో సంతకం

  • డ్రగ్స్ నియంత్రణ పై మూడో సంతకం

 

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. తాను హామీ ఇచ్చిన మాదిరిగా మూడు ముఖ్యమైన ఫైళ్లపై సంతకం చేశారు. అందులో ప్రధానమైనది 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇంకొకటి మహిళల రక్షణ కోసం సింగ పెన్ ప్రత్యేక దళం, మరొకటి రాష్ట్రవ్యాప్తంగా మాదకద్రవ్యాల నిర్మూలన చర్యలకు సంబంధించిన ఫైల్. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ మూడు ఫైళ్లపై సంతకం చేశారు విజయ్.

తమిళనాడులో ప్రస్తుతం గృహ అవసరాలకు మొదటి 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. అయితే తాను అధికారంలోకి వస్తే ఆ పరిమితిని 200 యూనిట్లకు పెంచుతానని విజయ్ హామీ ఇచ్చారు. అందుకే తన తొలి సంతకంగా ఆ ఫైల్ పై సంతకం చేశారు. తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రధాన హామీని మొదటి రోజే అమలు చేశారు. రెండు నెలలకు 500 యూనిట్ల వరకు విద్యుత్తును వినియోగించే గృహ వినియోగదారులకు.. రెండు నెలలకు కలిపి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తుంది.

ఇక రెండో హామీగా మహిళల భద్రతకు సంబంధించిన ప్రత్యేక రక్షణ దళం ఫైల్ పై కూడా సంతకం చేశారు. సింగపెన్ ప్రత్యేక టాస్క్ఫోర్సును ఏర్పాటు చేస్తూ అక్కడికక్కడే ఉత్తర్వులు జారీ చేశారు. * ఇక రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు విజయ్. ఆ హామీకి సంబంధించిన ఫైల్ పై మూడో సంతకం చేశారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తమిళనాడు ను తీర్చిదిద్దడమే లక్ష్యం అని పేర్కొన్నారు. విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్ క్లబ్బుల ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు విజయ్.

అందుకే ఇప్పుడు మాదకద్రవ్యాల నిరోధక విభాగాలను ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగానికి ఆదేశించారు. అయితే భారీ ఖర్చుతో కూడుకున్న హామీలను తన నెత్తిపై వేసుకునే ప్రయత్నం చేయలేదు. ఆర్థిక పరిస్థితిని అధ్యయనం చేస్తానని.. త్వరలో శ్వేత పత్రం విడుదల చేస్తానని.. రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని.. ఖజానా ఖాళీగా ఉందని చెప్పుకొచ్చారు విజయ్. తద్వారా ఆర్థిక భారంతో కూడిన పథకాలు తరువాతనేనని సంకేతాలు పంపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు