HomeజాతీయంCM Revanth Reddy : కేర‌ళ కాంగ్రెస్ సొంతం...సార‌థులంద‌రికి అభినంద‌న‌లు...!సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : కేర‌ళ కాంగ్రెస్ సొంతం…సార‌థులంద‌రికి అభినంద‌న‌లు…!సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, క్రైమ్ మిర్ర‌ర్‌: కేరళ వంటి చైతన్యవంతమైన గడ్డపై అసాధారణ పట్టుదలతో, అలుపెరగని పోరాట పటిమను ప్రదర్శించి, స్ఫూర్తిదాయక విజయాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ కూటమి సారథులకు, అంకితభావం కలిగిన కార్యకర్తలకు, పార్టీ సైనికులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భినందనలు తెలిపారు. ఈ చారిత్రాత్మక విజయం దిశగా మా అందరినీ నడిపించిన మన గొప్ప నాయకత్వానికి, ముఖ్యంగా రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ, దీపా దాస్ మున్షీ , కే.సి. వేణుగోపాల్ అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.

వ్యక్తిగతంగా, కేరళ ఎన్నికల ప్రచార పర్వంలో నాపై అపారమైన అభిమానాన్ని కురిపించి, నిరుపమానమైన సోదరభావాన్ని చాటుకున్న యూడీఎఫ్ నాయకులకు, మద్దతుదారులకు, కేరళ ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అభ్యుదయ భావజాలం, , ప్రజాస్వామ్య స్ఫూర్తిని పుణికిపుచ్చుకున్న మన రెండు రాష్ట్రాలు దేశానికే ఆదర్శమని అన్నారు.అభివృద్ధిని శ్వాసించే మనం, దశాబ్ద కాలపు వంచనను, నిరాశానిస్పృహలను పారద్రోలి… కాంగ్రెస్ సుపరిపాలనలో ఉజ్వల భవిష్యత్తు వైపు సాగే నవశకానికి నాంది పలకబోతున్నమని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు