HomeజాతీయంBJP Power: దేశంలో బీజేపీ హవా.. 70% రాష్ట్రాల్లో ఎన్డీయే పాలన!

BJP Power: దేశంలో బీజేపీ హవా.. 70% రాష్ట్రాల్లో ఎన్డీయే పాలన!

దేశ రాజకీయాల్లో కీలక మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ప్రభావం రాష్ట్రాలపై మరింతగా పెరుగుతోంది. దేశంలోని మొత్తం రాష్ట్రాలను పరిశీలిస్తే, సుమారు 70 శాతం ప్రాంతాల్లో బీజేపీ లేదా దాని మిత్రపక్షాల పాలన కొనసాగుతోంది. మొత్తం 29 రాష్ట్రాలు (ఢిల్లీతో పాటు) ఉండగా, అందులో 16 రాష్ట్రాల్లో బీజేపీ నేరుగా అధికారంలో ఉంది. తాజాగా బెంగాల్‌లో సాధించిన విజయంతో ఈ సంఖ్య 17కు పెరిగింది.

బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలు

బీజేపీ స్వయంగా పాలిస్తున్న రాష్ట్రాల్లో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గోవా, గుజరాత్, హరియాణా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, ఒడిశా, రాజస్థాన్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా విజయం సాధించి పాలన కొనసాగిస్తోంది.

ఎన్డీయే కూటమి పాలన కొనసాగే రాష్ట్రాలు  

ఇక మరోవైపు, ఎన్డీయే కూటమి ద్వారా కూడా బీజేపీ తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. ఆంధ్రప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం, పుదుచ్చేరి వంటి ప్రాంతాల్లో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం నడుస్తోంది. ఈ రాష్ట్రాల్లో స్థానిక పార్టీలు ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ, బీజేపీ కీలక భాగస్వామిగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, మేఘాలయంలో ఎన్‌పీపీ, నాగాలాండ్‌లో ఎన్‌డీపీపీ, సిక్కింలో ఎస్‌కేఎం, పుదుచ్చేరిలో ఏఐఎన్నార్సీ నేతృత్వంలో ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి.

ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు

కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నాయి. తమిళనాడులో టీవీకే ప్రధాన శక్తిగా నిలిచింది. కేరళలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. అలాగే తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ, జార్ఖండ్‌లో జేఎంఎం, మిజోరంలో జెడ్‌పీఎం ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. దేశ రాజకీయ పటంలో బీజేపీ, దాని మిత్రపక్షాలు బలంగా నిలుస్తున్నాయి.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు