HomeతెలంగాణPooja Hegde: బుట్ట బొమ్మా ప్రేమ‌లో ప‌డిందా...టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌...!

Pooja Hegde: బుట్ట బొమ్మా ప్రేమ‌లో ప‌డిందా…టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌: టాలీవుడ్ బుట్టబొమ్మగా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే గత కొంతకాలంగా సినిమాల విషయంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తుంది. ఒకప్పుడు వరుస హిట్స్‌తో దూసుకెళ్లిన ఈ బ్యూటీ, తర్వాత వచ్చిన బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్‌తో కెరీర్‌లో కాస్త వెనుకబడింది. ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన పూజా, తన అందం మరియు అభినయంతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన పూజా, తన అందం మరియు అభినయంతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ‘దువ్వాడ జగన్నాథం’, ‘అరవింద సమేత’, ‘మహర్షి’, ‘గద్దలకొండ గణేష్’, ‘అలా వైకుంఠపురంలో’ వంటి సినిమాలతో వరుస విజయాలు అందుకుంది. అయితే ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’, ‘బీస్ట్’ చిత్రాల పరాజయాలు ఆమె కెరీర్‌పై ప్రభావం చూపాయి.

తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో అవకాశాలు వచ్చినప్పటికీ పెద్దగా హిట్స్ అందుకోలేకపోయింది. దీంతో స్పెషల్ సాంగ్స్ వైపు కూడా అడుగులు వేసింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం పూజా వ్యక్తిగత జీవితం కూడా వార్తల్లో నిలుస్తోంది. బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రాతో ఆమె ప్రేమలో ఉందనే వార్తలు బీటౌన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. గతంలో కూడా సల్మాన్ ఖాన్‌తో ఆమె రిలేషన్‌లో ఉందనే రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల పూజా హెగ్డే , రోహన్ మెహ్రా పలుమార్లు కలిసి కనిపించడం, బయటకు వెళ్లడం వంటి ఘటనలు ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయిన వీరిద్దరూ ప్రస్తుతం సీరియస్ రిలేషన్‌లో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు