Homeక్రైమ్Nida Khan Case: మలేషియాలో ఉద్యోగం ఆశ చూపి.. నిదాఖాన్ కేసులో మరో సంచలనం!

Nida Khan Case: మలేషియాలో ఉద్యోగం ఆశ చూపి.. నిదాఖాన్ కేసులో మరో సంచలనం!

Alleged Conversion Attempt: మహారాష్ట్రలోని నాసిక్‌ లో వెలుగులోకి వచ్చిన వివాదాస్పద కేసులో ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న నిదా ఖాన్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కోర్టు తీర్పును తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ కేసులో ఆమె పాత్రకు సంబంధించిన ముఖ్యమైన ఆధారాలను పోలీసులు కోర్టులో సమర్పించారు.

అసలేం జరిగిందంటే?

బాధితురాలైన మహిళా టెకీపై మత మార్పిడి ఒత్తిడి తీసుకురావడంలో నిదా ఖాన్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు వెల్లడించారు. ఆమెకు నమాజ్ చేయడం, హిజాబ్ ధరించడం లాంటి విషయాలు నేర్పించిందన్నారు. అంతేకాకుండా, మత మార్పిడి ప్రయత్నంలో భాగంగా బాధితురాలి పేరును  హనియాగా మార్చినట్లు పోలీసులు వివరించారు.

మలేషియాలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ..

మలేసియాలో ఉద్యోగం ఇప్పిస్తామని, మంచి జీవితం కల్పిస్తామని చెప్పి బాధితురాలిని ఆకర్షించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అయితే ఆమె అంగీకరించకపోతే కుటుంబానికి ఇబ్బందులు కలిగిస్తామని బెదిరించారని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో నిందితురాలిని పోలీసు కస్టడీలోకి ఇవ్వాలని అధికారులు కోర్టును కోరారు. ప్రస్తుతం కోర్టు ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తూ, బెయిల్‌పై తుది నిర్ణయం తర్వాత ప్రకటించనుంది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు