Homeతెలంగాణరేవంత్ రెడ్డి రాహువు...కేసీఆర్ కేతువు...! బండి సంజ‌య్ ఫైర్‌...

రేవంత్ రెడ్డి రాహువు…కేసీఆర్ కేతువు…! బండి సంజ‌య్ ఫైర్‌…

  • తెలంగాణ‌ను దోచుకోవ‌డానికే నాట‌కం

  • ప్ర‌జ‌ల‌ను న‌మ్మించ‌డానికే తిట్ల పురాణం

  • ఒక‌రు చావాలంట‌రు…మ‌రొక‌రు అసెంబ్లీకి రా చూసుకుందాం అంట‌రు…

  • గార‌డి మాట‌లు ల‌క్ష‌ల్లో మూట‌లు

  • ఇద్ద‌రి శ‌ని తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ప‌ట్టుకుంది…

కరీంనగర్, క్రైమ్ మిర్ర‌ర్ః సీఎం రేవంత్ రెడ్డి రాహువు….కేసీఆర్ కేతువు అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యాడు. ఇద్ద‌రు గార‌డి మాట‌ల‌తో ప్ర‌జ‌ల‌ను న‌మ్మించి ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను దోచుకున్నార‌ని మండిప‌డ్డారు. ఒక‌రు చావాలంట‌రు..మ‌రొక‌రు అసెంబ్లీకి రా చూసుకుందాం అంట‌రూ ఇలా తిట్ల పురాణంతో ప‌బ్బం గుడ‌పుతు తెలంగాణ ప్ర‌జ‌ల‌ను చంపుక తింటున్న‌ర‌న్నారు. ఇద్ద‌రి శ‌నితో తెలంగాణ అప్పుల ఊబిలో కూరక‌పోయి రాష్ర్ట ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని అన్నారు.

కాళేశ్వరం స్కాంలో కేసీఆర్ ను కాపాడుతోంది రేవంత్ రెడ్డే, రూ.9 వేల కోట్లపైనే విచారణ జరపాలని సీబీఐకి లేఖ రాశారు. లక్ష కోట్ల అవినీతిపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్ర‌శ్నించారు. తేజస్వీ వ్యాఖ్యలను కాంగ్రెస్, బీఆర్ఎస్ వక్రీకరించాయి. తెలంగాణ ఉద్యమకారులను తేజస్వీ దేశభక్తులతో పోల్చార‌ని పేర్కొన్నారు. కాళేశ్వరంసహా కేసీఆర్ కుటుంబం చేసిన అవినితిని కప్పిపుచ్చేందుకు రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని గత ఎన్నికల్లో చెప్పిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రూ.9 వేల కోట్లకే పరిమితమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణాలపైనే విచారణ జరపాలని సీబీఐకి లేఖ రాయడమే ఇందుకు నిదర్శనమన్నారు.

కేసీఆర్ అవినీతి బయటపడాలంటే రూ.లక్ష కోట్ల కాళేశ్వరం నిర్మాణంపై విచారణ జరపాల్సి ఉందన్నారు. రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ ను కాపాడాలనే ఉద్దేశంతోనే డిజైన్ లోపాలతో నిర్మించిన మేడగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలపై మాత్రమే సీబీఐ విచారణ కోరుతున్నారని చెప్పారు. రేవంత్ కు దమ్ముంటే లక్ష కోట్ల రూపాయల కాళేశ్వరం అవినీతిపై విచారణ కోరుతూ సీబీఐకి లేఖ రాయాలని సవాల్ విసిరారు.

రేకుర్తి చెరువుకు శంఖు స్థాప‌న‌…

కరీంనగర్ లోని రేకుర్తి చెరువు సుందరీకరణ పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ అభివ్రుద్ధిలో భాగంగా అమృత్‌- 2 పథకంలో భాగంగా 3 చెరువుల పునరుజ్జీవం కోసం 5 కోట్ల 82 లక్షల రూపాయల నిధులను కేంద్రం మంజూరు చేసింది. అందులో భాగంగా 1 కోటి 98 లక్షల రూపాయలతో రేకుర్తి చెరువు పునరుజ్జీవ పనులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉంద‌న్నారు.ఆయ‌న వెంట మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు గుగ్గిళ్ల రమేశ్, బోయినిపల్లి ప్రవీణ్ రావు, బండ రమణారెడ్డి లు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు