Homeక్రైమ్త‌వ్వే కొద్దీ బ‌య‌ట‌ప‌డుతున్న గ్యాస్ ఏజెన్సీ భాగోతం....!హోట‌ళ్ల‌తో కుమ్మ‌క్కై అడ్డ‌దారుల్లో సంపాద‌న‌...

త‌వ్వే కొద్దీ బ‌య‌ట‌ప‌డుతున్న గ్యాస్ ఏజెన్సీ భాగోతం….!హోట‌ళ్ల‌తో కుమ్మ‌క్కై అడ్డ‌దారుల్లో సంపాద‌న‌…

  • ప్రజలకు అందాల్సిన సిలిండర్లు బ్లాక్‌లో విక్రయం …

  • ప‌ట్టించుకోని అధికారులు

 

రంగారెడ్డి ప్రతినిధి, క్రైమ్ మిర్రర్: రంగారెడ్డి జిల్లా అమనగల్‌ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ అక్రమాలు రోజురోజుకూ ఎక్కువ‌వుతున్నాయి. త‌వ్వే కొద్ది నిర్వాహ‌కుల భాగోతాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ప్రజలకు సరఫరా చేయాల్సిన డొమెస్టిక్ 14 కేజీల గ్యాస్ సిలిండర్లను బ్లాక్‌లో అధిక ధరలకు హోటళ్లకు అమ్ముతున్నట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.నియమాల ప్రకారం హోటళ్లలో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు వినియోగించాలి. కానీ డెలివరీ బాయ్‌లతో కలిసి హోటల్ యాజమాన్యాలు కుమ్మక్కై, డొమెస్టిక్ సిలిండర్లను అక్రమంగా వాడుతున్నట్లు సమాచారం.

ప‌ట్టించుకోని ఎజెన్సీ నిర్వాహ‌కులు…

ఇదిలా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా, ఏజెన్సీ యాజమాన్యం మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. డెలివరీ బాయ్‌ల సహకారంతో ఈ అక్రమాలు కొనసాగుతున్నాయని ప్రజలు చెబుతున్నారు.గత రెండు సంవత్సరాలుగా ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నప్పటికీ, సంబంధిత నిఘా వ్యవస్థ మాత్రం స్పందించకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత సివిల్ సప్లై అధికారులు వెంటనే స్పందించి, ఈ గ్యాస్ ఏజెన్సీపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు