ముంబై, క్రైమ్ మిర్రర్ః ఒక రాష్ర్టానికి మూడు సార్లు సీఎం అయిందంటే ఎంత సంపాదించిందో, లెక్క లేనన్ని ఆస్తులు ఉన్నాయో అనే ప్రతి ఒక్కరికి మదిలో ఆలోచన సాధరణంగా వస్తుంది. కాని వీటన్నింటికి వ్యతిరేకం బెంగాల్ దీదీ. ప్రజలకు సేవా చేయాలనే అంకితభావం, తపన, వ్యక్తిగత సంపాదనకు ప్రజల్లో ఓ సామాన్యు రాలిగా నిరాడంబర జీవితం గడుపుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.
సుదీర్ఘకాలంగా సీఎంగా నేటితరం రాజకీయ నాయకులకు భిన్నంగా కాటన్ చీర, భుజాన గుడ్డ సంచి, కాళ్లకు రబ్బరు చెప్పులతో ఉంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా, తనకు సొంత ఇల్లు, కారు,సెంటు భూమి కూడా లేదని బెంగాల్ సీఎం మమతా వెల్లడించడం మరోసారి చర్చనీయాంశంగా మారింది.పశ్చిమ్ బెంగాల్ శాసనసభ ఎన్నికలల్లో భవానీపూర్ నుంచి పోటీ చేస్తున్న మమతా బెనర్జీ నామినేషన్ వేశారు. నామినేషన్ సమయంలో ఎప్పటిలాగే తన ట్రేడ్‌మార్క్ కాటన్ చీర, రబ్బరు చెప్పులతో సాదాసీదాగా వచ్చారు.
దీదీ తన ఎన్నికల అఫిడ్‌విట్‌లో ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం తన చేతిలో రూ.75 వేలు, ఇండియన్ బ్యాంక్‌లో తన పేరిట ఉన్న వ్యక్తిగత ఖాతాలో సుమారు రూ.12.4 లక్షలు నగదు ఉన్నట్టు మమతా తెలిపారు. అదే బ్యాంకులోని మరో ఖాతాలో ఎన్నికల ఖర్చుల కోసం రూ.40,000 ఉన్నాయని వెల్లడించారు. మొత్తం బ్యాంకు నిల్వలు దాదాపు రూ.13 లక్షలుగా పేర్కొన్నారు. తన వద్ద కేవలం 9.75 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయని, 2021లో వాటి విలువ రూ.88,887గా ఉండేదని, ప్రస్తుతం ధరలు పెరగడంతో రూ.1.75 లక్షలకు చేరింది.
గత ఐదేళ్లలో ఆమె ఆస్తులు తగ్గడం గమనార్హం. ఇక, తన పేర 2021లో రూ.16.72లక్షల విలువైన చరాస్తులు ఉన్నట్టు వివరించారు. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరంలో టీడీఎస్ రిఫండ్ రూ.40,600 వచ్చిందని వెల్లడించారు. ఇక, రాయల్టీలు, బ్యాంక్ వడ్డీలు తన ప్రాథమిక ఆదాయ వనరుగా పేర్కొన్నారు. 2024-25లో దీదీ ఆదాయం రూ.23.21 లక్షలు కాగా.. ఇది 2023-24 కంటే (రూ.20.72 లక్షలు) అధికం. అయితే, మమతా బెనర్జీకి అత్యధికంగా ఆదాయం 2021-22లో రూ.38.14 లక్షలుగా ఉంది.క, కాళీఘాట్‌లోని 30-B హరీశ్ చటర్జీ వీధిని తన చిరునామాగా నామినేషన్‌లో దీదీ పేర్కొన్నారు.
కానీ ఆ భవనం ఆమె పేరుతో లేదు. ఇప్పటి వరకు తనకంటూ ఒక సొంత ఇల్లు లేదని ఆమె అఫిడవిట్‌లో పేర్కొనడం గమనార్హం. ఇక, 2021 బెంగాల్ ఎన్నికల సమయంలో ఏడీఆర్ నివేదిక ప్రకారం.. దేశంలోనే పేద ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ నిలిచారు. ఆమె ఆస్తులు కేవలం రూ.15 లక్షలే. 2016లో ఇవి రూ.30 లక్షలుగా ఉన్నాయి.
