ఢిల్లీ, క్రైమ్ మిర్రర్: పశ్చిమాసియలో 40 రోజుల యుద్దం అనంతరం అమెరికా, ఇరాన్ రెండు దేశాలు 15 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీంతో ఇరాన్ హర్మూజ్ జలసంధిని తెరిచింది. దీంతో అన్ని దేశాలు సంతోషం వ్యక్తం చేశాయి. కాని కాల్పుల విరమణ ఒప్పందం జరిగి 24 గంటలు కాకముందే మళ్లీ ఇరాన్ హర్మూజ్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. కాగా అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్న లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగింది. దీనికి నిరసనగా హర్మూజ్‌ను మూసివేసింది.
సురక్షిత మార్గాలు వెతుక్కోండంటూ ఇరాన్ ఆదేశం…
ఇరాన్ రెవల్యూషన్గార్డు గురువారం హర్మూజ్ జలసంధిపై కీలక ప్రకటన చేసింది. హర్మూజ్ జలసంధి మీదుగా ప్రయాణించే నౌకలు సముద్రపు సూత్రాలకు అనుగుణంగా, సముద్రపు అడుగున ఉన్న మైన్ల వల్ల జరిగే ప్రమాదాల నుంచి రక్షణ పొందేందుకు సురక్షిత మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. హోర్ముజ్ జలసంధిలో ఇటీవల జరిగిన సైనిక ఘర్షణల వల్ల అక్కడ సముద్రపు మైన్లు ఉన్నాయని, అవి వాణిజ్య నౌకలకు ప్రమాదకరమని ఇరాన్ పేర్కొంది. నౌకలు ఈ మైన్లను ఢీకొంటే భారీ పేలుళ్లు జరిగే అవకాశం ఉన్నందున, సురక్షితమైన ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాలని సూచించింది.
ఆగని దాడులు…
అమెరికా, ఇరాన్ దేశాలు కాల్పుల విరమణ ప్రకటించినా లాభం లేకుండా పోయింది. అమెరికా తీసుకున్న నిర్ణయానికి ఇజ్రాయెల్ సమ్మతం తెలిపింది. కానీ, లెబనాన్‌పై మాత్రం యుద్ధం ఆగదని స్పష్టం చేసింది. అయితే, బుధవారం తమ దేశంలోని చమురు రిఫైనరీతోపాటు పలు ప్రాంతాలపై దాడులు జరిగినట్టు ఇరాన్ ఓ ప్రకటన చేసింది. మరోవైపు గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు కొనసాగాయి. ఇక, ఇరాన్‌పై జరిగిన దాడులపై అమెరికా స్పందించింది. కాల్పుల విరమణ ప్రకటన జరిగిన వెంటనే అమెరికా సైన్యం దాడులు నిలిపివేసిందని అమెరికా సైనికాధికారి ఒకరు తెలిపారు. కానీ, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయని వెల్లడించారు
