-
బాలికల రక్షణే లక్ష్యం
-
కేజీబీవీలో సీఐ దూది రాజు అవగాహన సదస్సు
-
నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ దూది రాజు
నాంపల్లి,(క్రైమ్ మిర్రర్): ప్రస్తుత సమాజంలో బాలికలు, మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను ధైర్యంతో ఎదుర్కోవాలని, చట్టాలపై అవగాహన కలిగి ఉండడమే ఆయుధమని, నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ దూది రాజు పిలుపునిచ్చారు. నాంపల్లి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో, విద్యార్థినులకు వ్యక్తిగత భద్రత, చట్టాలు, సామాజిక అంశాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
గుడ్ టచ్-బ్యాడ్ టచ్’పై అవగాహన
ఈ సందర్భంగా సీఐ రాజు విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడుతూ.. చిన్న వయసు నుండే బాలికలు తమరక్షణ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా మంచి స్పర్శ, చెడు స్పర్శల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు. ఎవరైనా అపరిచితులు, తెలిసిన వారైనా సరే, ఇబ్బందికరంగా ప్రవర్తిస్తే భయపడకుండా వెంటనే, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు తెలియజేయాలని కోరారు.సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్ఫోన్ వినియోగం పట్ల, అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

అపరిచితులతో స్నేహం ప్రమాదకరమని, వ్యక్తిగత ఫోటోలు, వివరాలను ఇంటర్నెట్లో పోస్ట్ చేయవద్దని సూచించారు. గుర్తు తెలియని నంబర్ల నుండి ఫోన్ కాల్స్, మెసేజ్లు వచ్చి వేధింపులకు గురిచేస్తే వెంటనే, పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు. షీ టీమ్స్, హెల్ప్ లైన్ సేవలు వేధింపులకు గురయ్యే బాలికలకు అండగా, ఉండటానికి షీ టీమ్స్ నిరంతరం పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. ఆపదలో ఉన్నప్పుడు వెంటనే 100 లేదా చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కి కాల్ చేయాలని సూచించారు.ఫిర్యాదు చేసిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని, విద్యార్థినులు నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చని భరోసా ఇచ్చారు.
ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు
చదువు ఒక్కటే మిమ్మల్ని ఉన్నత స్థితికి చేరుస్తుందని, అనవసరమైన ఆకర్షణలకు లోను కాకుండా, క్రమశిక్షణతో చదువుకొని తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని, సీఐ దూది రాజు విద్యార్థినులను ఉత్తేజపరిచారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ, చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. పోలీసుల చొరవను సూచనలను విద్యార్థినులు, పాఠశాల సిబ్బంది అభినందించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులలో, చేరిన నాటి నుండి సిఐ దూది రాజు, ఏదో ఒక సందర్బంలో ప్రజలకు అవగాహన, కల్పిస్తూ లాఅండ్ఆర్డర్ ను కంట్రోల్ చేస్తున్నారు. గతంతో పోలిస్తే సర్కిల్ పరిధిలో నేరాలు అదుపులో ఉన్నాయనే చెప్పుకోవాలి.. మూడు మండలాల ప్రజలు సిఐ సేవలను కొనియాడుతున్నారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి ఎస్ఐ లింగారెడ్డి, పాఠశాల ఉపాధ్యాయ బృందం,
