Homeతెలంగాణపాములపహాడ్ సర్పంచ్ చర్యతో కోతుల బెడదకు పరిష్కారం..!

పాములపహాడ్ సర్పంచ్ చర్యతో కోతుల బెడదకు పరిష్కారం..!

  • సర్పంచ్ అంజయ్యకు కృతజ్ఞతలు తెలుపుతున్నా గ్రామా ప్రజలు

  • భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్యలపై వెంటనే స్పందించాలని విన్నపం

క్రైమ్ మిర్రర్, మాడ్గులపల్లి ప్రతినిధి: నల్గొండ జిల్లా, మాడ్గులపల్లి మండలము, పాములపహాడ్ గ్రామంలో ఇటీవల కోతుల బెడద అధికమవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో గ్రామపంచాయతీ సమావేశంలో తీర్మానం చేశారు. గ్రామ ప్రజల కోరిక మేరకు గ్రామ పంచాయతీ సర్పంచ్ కునుకుంట్ల అంజయ్య చర్యలు చేపట్టారు.

తీర్మానం ప్రకారం కోతులను తరిమికొట్టేందుకు ప్రత్యేకంగా కొండముచ్చును గ్రామానికి తెప్పించారు. సాధారణంగా కోతులు కొండముచ్చును చూసి భయపడి పారిపోతాయని భావిస్తూ ఈ చర్య తీసుకున్నారు. ఈ కార్యక్రమం గ్రామస్థుల నుంచి మంచి స్పందనను పొందింది.

గ్రామంలో కోతుల బెడద తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ గ్రామ పెద్దలు, ప్రజలు సర్పంచ్ అంజయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్యలపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు