విశాఖపట్నం, క్రైమ్ మిర్రర్: భారత నౌకాదళ అమ్ముల పొదిలో మరో అణు జలాంతర్గామి చేరింది. దీనిని స్వదేశి సామర్థ్యం తో తయారు చేసిన జలాంతర్గామి సముద్ర జాల్లాల్లో శత్రువుల కన్నుకప్పి నీటి అడుగున మెరుపు దాడులు చేయగలా సత్తా కలిగిన మూడో అణు బాలిస్టిక్ క్షిపణి జలాంతర్్గమి ఐఎన్ ఎస్ అరదిమన్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్్ నేవికి అప్పగించారు.
విశాఖపట్నంలోని నేవీ షిప్ బిల్డింగ్ సెంటర్‌లో శుక్రవారం ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ దీన్ని నౌకాదళానికి అప్పగించారు.
నేవీలో ఇప్పటికే సేవలందిస్తున్న ఐఎన్‌ఎస్ అరిహంత్, ఐఎన్‌ఎస్ అరిఘాత్ సరసన ఇప్పుడు ఐఎన్‌ఎస్ అరిదమన్ కూడా చేరినట్టయింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో(విశాఖకు 50 కి.మీ. దూరం) తూర్పు నౌకాదళం కొత్తగా నిర్మించిన ప్రత్యామ్నాయ స్థావరం నుంచి అరిదమన్ సేవలందిస్తుంది. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వెజల్ (ఏటీవీ) ప్రాజెక్టు కింద విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్‌లో రెండు దశాబ్దాలుగా అణు జలాంతర్గాముల నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే.
తొలుత రష్యా సహకారంతో ఐఎన్‌ఎస్ అరిహంత్‌ను నిర్మించారు. ఇది పదేళ్ల నుంచి సేవలందిస్తోంది.రెండోదైన ఐఎన్‌ఎస్ అరిఘాత్‌ను 2024 ఆగస్టులో ప్రారంభించారు. ఇదే సిరీస్‌లో మూడోదైన ఐఎన్‌ఎస్ అరిదమన్ ఫిబ్రవరిలోనే సముద్ర పరీక్షలన్నీ పూర్తిచేసుకుంది. దీని తర్వాత ఎస్4 స్టార్, ఎస్4 ఆల్ఫా పేరుతో మరో రెండు అణు సబ్‌మెరైన్లు నిర్మితమవుతున్నాయి. ‘ఐఎన్‌ఎస్ అరిదమన్’లో ఎక్కువ ఆయుధాలు ఉంచడానికి వీలుగా 130 మీటర్ల పొడవు, 11 మీటర్ల వెడల్పుతో హాల్ నిర్మించారు.
ఇది సముద్ర ఉపరితలంపై ఉన్నప్పుడు 6వేల టన్నులు, లోపల ఉన్నప్పుడు 7వేల టన్నుల బరువును తరలించగలదు. సముద్ర ఉపరితలంలో గంటకు 12-15 నాటికల్ మైళ్ల వేగంతో, సముద్ర గర్భంలో గంటకు 24నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీనికి 83 మెగావాట్ సామర్థ్యం కలిగి నీటి ఒత్తిడితో పనిచేసే సీఎల్‌డబ్ల్యుఆర్-బీ1 రియాక్టర్‌ను అమర్చారు. ఇందులో బాలిస్టిక్ మిస్సైళ్లను నిట్టనిలువుగా ప్రయోగించే ఏర్పాట్లు ఉన్నాయి.
