Homeతెలంగాణఈ నెల 8 నుంచి ఎస్ఎస్ఏ-2 ప‌రీక్ష‌లు..

ఈ నెల 8 నుంచి ఎస్ఎస్ఏ-2 ప‌రీక్ష‌లు..

  • ఓపెన్ స్కూల్ ప‌రీక్ష‌ల నేప‌థ్యంలో మార్పులు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రంలోని 1వ తరగతి నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహించే సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ2) పరీక్షల షెడ్యూల్లో మార్పులు జ‌రిగాయి. గతంలో ఇచ్చిన డేట్స్ కంటే రెండు రోజులు ముందే ఎగ్జామ్స్ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఏప్రిల్ 10 నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా, వాటిని ఏప్రిల్ 8వ తేదీకి మార్చారు. ఈ మేరకు గురువారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కొత్త షెడ్యూల్ రిలీజ్ చేశారు.

ఏప్రిల్ 8న 6 నుంచి 9 తరగతులకు ఫస్ట్ లాంగ్వేజీ, ఏప్రిల్ 9 నుంచి 1 నుంచి 5 తరగతులకు ఫస్ట్ లాంగ్వేజీ పరీక్షలు ఉంటాయి. 1 నుంచి 7 తరగతులకు ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు, 8వ తరగతికి ఉదయం 9గంటల నుంచి 11:45 వరకు, 9వ తరగతికి ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. కాగా, ఏప్రిల్ 23న రాష్ట్రవ్యాప్తంగా అన్ని బడుల్లో పేరెంట్స్ సమావేశం నిర్వహించాలని అధికారులు ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments