Homeతెలంగాణభారీగా త‌గ్గిన ప‌సిడి రేట్లు...హైద‌రాబాద్‌లో ఎంతంటే...!

భారీగా త‌గ్గిన ప‌సిడి రేట్లు…హైద‌రాబాద్‌లో ఎంతంటే…!

హైదాబాద్ క్రైమ్ మిర్ర‌ర్ః ప‌శ్చిమాసియా యుద్దం ప్ర‌భావంతో బంగారం ధ‌ర‌ల్లో తీవ్రంగా ఉంటుంది. గురువారం హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,48,970 దగ్గర.. 22 క్యారెట్ బంగారం ధర రూ. 1,36,550 దగ్గర.. 18 క్యారెట్ బంగారం ధర రూ.1,11,730 దగ్గర ట్రేడ్ అయింది.

బంగారం ధరలపై యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంటోంది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లలో అస్థిరత్వం నెలకొంది. ఈ అనిశ్చితి కారణంగా చమురు, బంగారం ధరలపై గణనీయమైన ప్రభావం పడుతోంది. యుద్ధం ప్రారంభం అవడానికి ముందు 1.90 లక్షల రూపాయల దగ్గర ట్రేడ్ అయిన 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం.. ఇప్పుడు 1.48 లక్షల రూపాయలకు పడిపోయింది. బంగారం ధరలు ప్రతీ రోజు ఎంతో కొంత తగ్గుతూ వస్తున్నాయి. అమెరికా డాలర్ విలువ పెరగటం వల్ల కూడా బంగారం ధరలు ప్రభావం అవుతున్నాయి.

హైదరాబాద్ ఈ రోజు బంగారం ధ‌ర‌లు…

రోజు (శుక్రవారం ఉదయం) 24,22,18 క్యారెట్ గోల్డ్‌‌పై 10 రూపాయల చొప్పున తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,48,960 .. 22 క్యారెట్ బంగారం ధర రూ. 1,36,540 .. 18 క్యారెట్ బంగారం ధర రూ. 1,11,720లుగా ఉంది. నిన్న గురువారం హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,48,970 దగ్గర.. 22 క్యారెట్ బంగారం ధర రూ. 1,36,550 దగ్గర.. 18 క్యారెట్ బంగారం ధర రూ.1,11,730 దగ్గర ట్రేడ్ అయింది. బంగారం ధ‌ర‌లు మార్కెట్‌లో ఎప్ప‌టికప్పుడు మారుతుంటాయి కావున కొనుగోలు దారులు తెఎలుసుకొని కొనుగోలు చేయాలి.

 

తాజావార్తలు