Tuesday, March 24, 2026
Homeతెలంగాణహైదరాబాదులో గ్యాస్ కొరత.. సీపీ సజ్జనార్ క్లారిటీ

హైదరాబాదులో గ్యాస్ కొరత.. సీపీ సజ్జనార్ క్లారిటీ

క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్దాల కారణంగా మన భారతదేశంలో ఇంధనం మరియు LPG సిలిండర్ల కొరత ఏర్పడింది అని నిత్యం ప్రతిరోజు కూడా ఎన్నో వార్తలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో గ్యాస్ సిలిండర్ల కోసం అలాగే పెట్రోల్ మరియు డీజిల్ కోసం క్యూ లైన్ లలో నిలబడుతూ ఒక రద్దీని సృష్టిస్తూ ఉన్నటువంటి వీడియోలు చూసి ప్రతి ఒక్క సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిన్నటి రోజున హైదరాబాదులో చాలా పెట్రోల్ బంకులు కూడా మూసి వేయబడ్డాయి అని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ విషయంపై హైదరాబాద్ సిపి సజ్జనార్ క్లారిటీ అయితే ఇచ్చారు. హైదరాబాదులో ప్రస్తుతం ఇంధనం మరియు ఎల్పిజి సిలిండర్ల కొరత లేదు అని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికి అందే విధంగా తగినన్ని నిల్వలు అందుబాటులో ఉన్నాయి అని క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ప్రజలు అందరూ కూడా ఈ విషయాలను గమనించి పెట్రోల్ బంకులు మరియు గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూ కట్టి రద్దీని పెంచి ఆందోళన కలిగించోద్దు అని కోరారు. ఈ విషయాలపై పోలీసులు నిషితంగా పర్యవేక్షిస్తున్నారు అని.. ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని వెంటనే నమ్మవద్దు అని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు.

యువ‌త భ‌గ‌త్ సింగ్ వార‌సులై ముందుకు సాగాలి….రామ‌డుగు ల‌క్ష్మ‌ణ్‌

అమరవీరుల ఆశయ సాధనకు యువత నడుం బిగించాలి: సిపిఐ జిల్లా కార్యదర్శి

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments