చండూరు,క్రైమ్ మిర్రర్ :- వ్యక్తిగత కారణాలతో జరిగిన గొడవను కాంగ్రెస్ పార్టీపై రుద్దుతున్న బీజేపీ నాయకులారా ఖబర్దార్ అంటూ చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు హెచ్చరించారు.ఆయన చండూరులో గురువారం స్థానిక నాయకులతో కలిసి ప్రెస్ మీట్ లో మాట్లాడారు.రిమాండ్ కు పంపబడ్డ 16 మందిలో 12 మంది బిఆర్ఎస్ నాయకులు ఉండగా కేవలం నలుగురు మాత్రమే కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారన్నారు. చండూరులో బిఆర్ఎస్- బిజెపి నాయకులకు అక్రమ సంబంధం ఉండడంతో బిఆర్ఎస్ ను నిందించకుండా కేవలం కావాలనే కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లుతూ కాంగ్రెస్ గుండాలంటూ మాట్లాడుతున్నారు అన్నారు. కావాలనే కోమటిరెడ్డి బ్రదర్స్ కోడి బ్రదర్స్ పైన నిందలు మోపుతూ పిచ్చలవిడిగా మాట్లాడుతున్నారన్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో 12 విడతల్లో 1970 మందికి కంటి ఆపరేషన్ చేయించారని అందులో 400 కుటుంబాలకు పైగా బిజెపి కుటుంబాలే ఉన్నాయన్నారు. బిజెపి నాయకులు కళ్ళుండి చూడలేని కబోదులు అన్నారు. డాక్టర్ జి.మనోహర్ రెడ్డి,నాగ వర్షిత్ రెడ్డి కూడా వస్తే వారికి కూడా కంటి ఆపరేషన్ చేయించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. చండూరులో ఉండే ప్రశాంత వాతావరణన్ని బిజెపి నాయకులు చెడగొడుతున్నారని బిజెపి నాయకులు రెచ్చగొడితే సహించేది లేదని త్వరలోనే అన్ని పార్టీల నాయకులను కూర్చోబెట్టి తిరిగి చండూరులో ప్రశాంత వాతావరణ నెలకొలుపుతామన్నారు.
డాక్టర్ జి.మనోహర్ రెడ్డి బిజెపికి పట్టిన దరిద్రం: మాజీ సర్పంచ్ కోడిగిరిబాబు
డాక్టర్ జి మనోహర్ రెడ్డి నియోజకవర్గ బిజెపికి పట్టిన దరిద్రమని మాజీ సర్పంచి కోడిగిరిబాబు విమర్శించారు. ఆయనకు ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చాయో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలన్నారు.బిజెపి నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపు అంచులకు వచ్చారు అని గుర్తు చేశారు.గొడవకు కారణమైన దోటి కిరణ్ ఓ ఇసుక వ్యాపారి అని తుమ్మలపల్లి లో జరిగిన చిల్లర పంచాయతీని గొడవలు దాకా తీసుకువచ్చి పార్టీలకు రుద్ధాదని అన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి గొడవలో లేని వారిని కూడా రిమాండ్ పంపించారని తెలిపారు. ఎదుటి వర్గానికి కూడా దెబ్బలు తగిలాయని కానీ పోలీసులు వారి ఫిర్యాదును పట్టించుకోలేదన్నారు.దళితుడి పైన దాడి జరిగితే కనీసం పోలీసులు పిటిషన్ కూడా తీసుకోలేదు అన్నారు.
ఇప్పటికైనా బాధితులకు న్యాయం జరగకపోతే త్వరలోనే చండూరు బంద్ కు పిలుపునిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, కౌన్సిలర్లు కటకం రమేష్, వాసు, మాజీ కౌన్సిలర్ కోడి వెంకన్న,పున్న ధర్మేందర్, కల్లెట్ల మారయ్య, భీమనపల్లి శేఖర్,ఐయితరాజు మల్లేష్,బ్రహ్మం, డీలర్ వెంకన్న ఇరి వెంకటేశం, గజ్జల కృష్ణారెడ్డి,లతీఫ్ ఖలీల్,జన్ను, వెంకన్న, దశరథ,ఐమద్, నాగరాజు,పందుల సత్యం,రవి,బోడ వెంకటేశం, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
