Homeతెలంగాణచినుకు పడితే ఎస్సీ కాలనీలో చిత్తడే : పల్లెటి జగన్

చినుకు పడితే ఎస్సీ కాలనీలో చిత్తడే : పల్లెటి జగన్

రంగారెడ్డి,క్రైమ్ మిర్రర్:- మాడ్గుల మండలం నాగిళ్ళ గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం పడిన ప్రతీసారి కాలనీలో రోడ్లు మొత్తం చిత్తడిగా మారి, ప్రజలు బయటకు రావడానికే కష్టంగా మారుతోంది. ముఖ్యంగా బజార్‌కు వెళ్లాలంటే కూడా నడవలేని పరిస్థితి నెలకొంది. గత ఐదు సంవత్సరాలుగా ఈ సమస్యపై కాలనీ ప్రజలు పలుమార్లు అధికారులకు వినతులు అందజేసినా, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజల ప్రాథమిక అవసరాలపై అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడం సరైంది కాదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రంగారెడ్డి జిల్లా ఎస్సీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ పల్లేటి జగన్ మాట్లాడుతూ, ఎస్సీ కాలనీ సమస్యను వెంటనే పరిష్కరించేందుకు గ్రామ సర్పంచ్ తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలనీలో రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే పనులు చేపట్టకపోతే, పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఏపీలో నేటి మధ్యాహ్నం నుంచి దంచికొట్టనున్న భారీ వర్షాలు!

ఈసారి కప్పు బెంగళూరుదే.. ABD సంచలన వ్యాఖ్యలు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు