Homeతెలంగాణతెలంగాణలో గ్యాస్ కొరత.. ఏజెన్సీల వద్దకు చేరుకుంటున్న ప్రజలు!

తెలంగాణలో గ్యాస్ కొరత.. ఏజెన్సీల వద్దకు చేరుకుంటున్న ప్రజలు!

క్రైమ్ మిర్రర్,తెలంగాణ :- తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ కొరత కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా గ్యాస్ నిల్వలు తగ్గిపోవడం.. ప్రముఖ నగరాలలో రెస్టారెంట్లు మరియు హాస్టల్స్ లలో కూడా ఈ మధ్య గ్యాస్ కొరత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా గ్యాస్ కొరత కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల ప్రజలు సైతం అల్లాడుతున్నారు. తెల్లవారుజాము నుంచే ఏజెన్సీల ముందు ఖాళీ సిలిండర్లతో క్యూ కడుతూ ఉన్నటువంటి దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైర్లు అవుతున్నాయి. ఈరోజు ముఖ్యంగా ఆదిలాబాద్ మరియు నిజామాబాద్ లోని ప్రజలు ఖాళీ సిలిండర్లు పట్టుకొని ఏజెన్సీల వద్దకు చేరుకున్నారు. సిలిండర్ బుక్ చేసుకుని ఐదు రోజులవుతున్న.. ఓటిపి వచ్చిన కూడా డెలివరీ చేయకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తో పాటు ఉద్దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా ఇవే పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం.

తమిళనాడు రాజకీయాల్లో త్రిష చక్రం తిప్పుతుందా..?

ఇరాన్ కోలుకోవ‌డానికి ప‌దేళ్లు ప‌డుతుంది: ట్రంప్‌

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు