- ఎక్కడికక్కడ అరెస్టులు
పల్నాడు,క్రైమ్ మిర్రర్: అంగన్వాడీలు తమ సమస్య లు పరిష్కరిచాలంటూ డిమాండ్ చేస్తూ చలో విజయవాడ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బయలు దేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు పల్నాడు జిల్లా వ్యాప్తంగా వందలాది మంది అంగన్వాడీలను అరెస్టు చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను మహిళలని కూడ చూడ కుండా పోలీసులు ఉక్కుపాదం మోపారు.
మంగళవారం ఉదయం వేలాదిగా పోలీసులు శిబిరంలోకి వెళ్లి మూకుమ్మడి అరెస్టులు చేశారు.అంతేగాకుండా వారిపట్ల పాశవికంగా వ్యవహరించారు. టెంటు కూల్చివేసి, లైట్లు ఆర్పివేసి ఈడ్చుకుంటూ లాక్కెళ్లి బస్సుల్లోకి ఎక్కించారు. పోలీసులు తమ విప్ల కఠినంగా వ్యహరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించకపోతే రాష్ర్ట వ్యాప్తంగాఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
కాగా సత్తెనపల్లి,రాజుపాలెం,ముప్పాళ్ళ, చిలకలూరిపేట,రొంపిచర్లలో అంగన్వాడీలను అరెస్టులు చేసారు. అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె సుబ్బారావమ్మ, రాష్ట్ర అధ్యక్షురాలు బేబిరాణి లను సత్తెనపల్లి స్టేషన్ లో నిర్బంధించారు.
