- కుటుంబ కలహాలే కారణమా…రేకెత్తిస్తున్న పలు అనుమానాలు
యాదాద్రి భువనగిరి, క్రైమ్ మిర్రర్: అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు కూతురు (10 నెలలు), కుమారు (2 సంవత్సరాలు) చంపి తల్లి సైతం ఆత్మహత్య చేసుకున్న సంఘటన యాదాద్రి భువన గిరి జిల్లాలో చోటు చేసుకుంది. బీబీనగర్ మండలం గొల్లగూడెంలో తెల్లవారుజామున విషాదం చోటు చేసుకుంది. దీంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. కాగా భర్త వేధింపులే కారణంతో ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తుంది. కాగా భర్త రైల్వే లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపారు. దీంతో పోలీసులు మృతికి గల కారణాలు తెలుసుకుంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
