Homeతెలంగాణశంకర్‌పల్లి మోకిల వద్ద ప్రమాదం.. టిప్పర్‌ను ఢీకొన్న నారాయణ స్కూల్ బస్సు

శంకర్‌పల్లి మోకిల వద్ద ప్రమాదం.. టిప్పర్‌ను ఢీకొన్న నారాయణ స్కూల్ బస్సు

•సుమారు 10 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలు – లలిత ఆసుపత్రికి తరలింపు

క్రైమ్ మిర్రర్,శంకర్‌పల్లి:-రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల పరిధిలోని మోకిల గ్రామ శివారులో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నారాయణ స్కూల్ కు చెందిన స్కూల్ బస్సు ముందుగా వెళ్తున్న టిప్పర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో సుమారు 10 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి గాయపడిన విద్యార్థులను శంకర్‌పల్లిలోని లలిత ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి ప్రాథమిక చికిత్స అందించి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. స్థానికులు ఈ మార్గంలో భారీ వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.

బుమ్రాను దాటి సరికొత్త చరిత్ర సృష్టించిన బౌలర్ అర్షదీప్?

Telangana: ఉద్యోగులకు భారీ ఊరట.. పెండింగ్ బిల్లులకు రూ.745 కోట్లు విడుదల

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు