Homeక్రైమ్క‌లెక్ట‌ర్‌కు జైలు శిక్ష

క‌లెక్ట‌ర్‌కు జైలు శిక్ష

  • అప్పీలుకు నాలుగు వారాల గుడువు
  • మెద‌క్ జిల్లాలో సంచ‌ల‌నం

మెదక్, క్రైమ్ మిర్ర‌ర్‌: జిల్లా క‌లెక్ట‌ర్ రాహుల్ రాజ్ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ(ధిక్క‌రించ‌డం) పేర్కొంటూ హైకోర్టు జైలు శిక్ష విధించడం జిల్లాల్లో సంచలనంగా మారింది. చేగుంట మండలం బోనాల గ్రామానికి చెందిన లక్ష్మీ అనే మహిళ భూమి వివరాల కేసును పరిష్కరించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేసి భూ సమస్యను పరిష్కరించాలని హైకోర్టు కలెక్టర్ రాహుల్ రాజ్ ను ఆదేశించింది.

సమస్యను పరిష్కరించకుండా గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోలేదంటూ లక్ష్మీ కోర్ట్ ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టును మ‌హిళను కోర్టు చుట్టు ప‌దే ప‌దే తిప్ప‌డం స‌రైన విచార‌ణ చేప‌ట్ట‌క‌పోవ‌డాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించింది.

ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని పేర్కొంటూ కలెక్టర్ రాహుల్ రాజ్ కు ఆరు నెలల సాధార‌ణ జైలు శిక్షతో పాటు రూ. 2వేల జరిమానా విధించింది. కాగా క‌లెక్ట‌ర్ అప్పీల్ చేసుకునే అవ‌కాశం కోసం శిక్ష అమ‌లును నాలుగు వారాలు నిలిపివేసింది.

Most Popular

Recent Comments