HomeసినిమాActress Trisha: నా వ్యక్తిగత జీవితంపై దిగజారుడు మాటలు వద్దు, నటి త్రిష మండిపాటు!

Actress Trisha: నా వ్యక్తిగత జీవితంపై దిగజారుడు మాటలు వద్దు, నటి త్రిష మండిపాటు!

  • ఉన్నత పదవిలో ఉంటూ అసహ్యకరమైన వ్యాఖ్యలా?

  • రాజకీయాల్లోకి నా వ్యక్తిగత జీవితాన్ని తాగడమేంటి?

  • తమిళ బీజేపీ అధ్యక్షుడిపై సినీ నటి త్రిష ఆగ్రహం

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌ ఇటీవల టీవీకే అధ్యక్షుడు విజయ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్లో తన పేరు ప్రస్తావించడంపై సినీ నటి త్రిష తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తమిళ రాజకీయాల్లో ఉన్నతమైన పార్టీ పదవిలో ఉంటూ ఇంతటి అసహ్యకరమైన, అనుచితమైన వ్యాఖ్యలు చేస్తారని నేను ఊహించలేదంటూ మండిపడ్డారు. ఇటీవల నయినార్‌ నాగేంద్రన్‌ విలేకరులతో మాట్లాడుతూ.. విజయ్‌కి ఏమీ తెలియదు. అతనికి అనుభవం లేదు. ముందుగా అతను తన ఇంటి నుంచి బయటకు వచ్చి చూడమనండి. అంతకంటే ముందు అతను త్రిష నుంచి దూరమైతేనే వాస్తవాలను గ్రహించగలుగుతాడని వ్యాఖ్యానించారు.

నాగేంద్రన్ పై త్రిష ఆగ్రహం

ఈ నేపథ్యంలో త్రిష.. నయినార్‌ నాగేంద్రన్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆమె తరపున న్యాయవాది సోమవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఏ రాజకీయ పార్టీతోనూ త్రిషకు సంబంధాలు లేవని, అలా ఉండాలనే ఉద్దేశం కూడా లేదని స్పష్టంచేశారు. తానెప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉంటానని, అన్ని పార్టీలతో తటస్థ వైఖరినే అవలంబిస్తానని పేర్కొన్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని ఒక వివాద వస్తువుగా మార్చొద్దని ఆమె నయినార్‌ నాగేంద్రన్‌కు హితవు పలికారు. కాగా, అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో నయినార్‌ నాగేంద్రన్‌ విచారం వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో నటి త్రిష గురించిన మాట తప్పుగా దొర్లిందన్నారు.

Read Also: శబరిమలలో మహిళలకు ప్రవేశం కేసు.. విచారణకు 9 మందితో సుప్రీం ధర్మాసనం!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

Most Popular

Recent Comments